కర్నాటకలో బియ్యం రాజకీయాలు ఊపందుకున్నాయి. పేద కుటుంబాలలోని ఒక్కొక్కరికి ఉచితంగా 10 కేజీల బియ్యం ఇస్తామన్న అన్నభాగ్య పధకాన్ని కేంద్రం అడ్డుకుంటోందని బెంగళూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కావాలనే కేంద్రం కర్నాటకకు బియ్యాన్ని సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్రాలకు బియ్యాన్ని కేంద్రం ఎందుకు విక్రయించడం లేదని ప్రశ్నించారు డీకే శివకుమార్. అన్న భాగ్య పథకాన్ని అడ్డుకోవడానికే బియ్యం విక్రయాలను నిలిపివేశారని ఆరోపించారు.
అయితే కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ నేతలు కూడా ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆరోపించారు మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై. పథకాన్ని అమలు చేయడం చేతకాకపోవడంతో కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు,
బెంగళూర్‌లో ప్రొటెస్ట్ చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నభాగ్య పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బియ్యం కొరత తీవ్ర ఆటంకంగా మారింది. తెలంగాణ , ఏపీ ,చత్తీస్‌ఘడ్ సీఎంలతో స్వయంగా మాట్లాడారు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..