కన్నడ నాట కమలం హవా..ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్‌

|

Dec 09, 2019 | 1:29 PM

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 15 స్థానాలకు గానూ ఒకటి, రెండు చోట్ల మినహా మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది కమలం పార్టీ.  ఇప్పటికే ఎల్లాపూర్‌ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి హెబ్బర్‌ శివరామ్‌ గెలుపుతో బోణీ కొట్టింది.  ఐతే ఇంకా పూర్తి ఫలితాలు వెలువడకముందే హస్తం పార్టీ చేతులెత్తేసింది. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ ఫలితాలపై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నామని..ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటామన్నారు. […]

కన్నడ నాట కమలం హవా..ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్‌
Follow us on

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 15 స్థానాలకు గానూ ఒకటి, రెండు చోట్ల మినహా మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది కమలం పార్టీ.  ఇప్పటికే ఎల్లాపూర్‌ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి హెబ్బర్‌ శివరామ్‌ గెలుపుతో బోణీ కొట్టింది.  ఐతే ఇంకా పూర్తి ఫలితాలు వెలువడకముందే హస్తం పార్టీ చేతులెత్తేసింది. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ ఫలితాలపై స్పందించారు. ఓటమిని అంగీకరిస్తున్నామని..ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటామన్నారు. ఫిరాయింపుదారులను ప్రజలు ఒప్పుకున్నారు.అందుకు మేం బాధపడాల్సినవసరం లేదని వ్యాఖ్యానించారు.

ఇక జేడీఎస్‌కు ఈ ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్‌ దక్కే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. 223 స్థానాలున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 105మందిఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకోవాలంటే మరో 7 స్థానాల్లో గెలవాల్సి ఉంది. ఐతే దాదాపు 12 నియోజకవర్గాల్లో కమలనాథులే పాగా వేసే ఛాన్స్‌ ఉండటంతో కన్నడ పీఠం మళ్లీ మాదేనంటూ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.