బ్లాక్ ఫంగస్ కేసుల అదుపుపై కేంద్రం వ్యూహమేమిటని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత రాహుల్.. అలర్ట్ కావాలని సూచన

| Edited By: Anil kumar poka

Jun 01, 2021 | 9:33 PM

దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అదుపు చేయడానికి మీ వ్యూహమేమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాధి చికిత్సకు వాడే మందుల కొరత దేశంలో

బ్లాక్ ఫంగస్ కేసుల అదుపుపై కేంద్రం వ్యూహమేమిటని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత రాహుల్.. అలర్ట్ కావాలని సూచన
keep all political work aside
Follow us on

దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అదుపు చేయడానికి మీ వ్యూహమేమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాధి చికిత్సకు వాడే మందుల కొరత దేశంలో ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారని ఆయన ట్వీట్ చేశారు. యాంఫోటెరిసిన్ -బీ అనే మెడిసిన్ ని ఎలా సేకరిస్తారు ? రోగికి ఈ మందు ఇచ్చే ప్రొసీజర్ ఏమిటి ? చికిత్స చేసే బదులు ప్రభుత్వం ఫార్మాలిటీస్ పేరిట పలు అవరోధాలు ఎందుకు కల్పిస్తోంది అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. కోవిద్ కేసులు ఓ వైపు తగ్గుతుండగా మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి.కర్ణాటకలో అత్యధికంగా 1250 కేసులు నమోదు కాగా-39 మంది మరణించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కూడా 39 మంది మృతి చెందగా యూపీలోని మీరట్ లో 147 కేసులు వెలుగు చూశాయి.

హిమాచల్ ప్రదేశ్, లో అప్పుడే ఒకరు మరణించారు. కాగా లిపోసోమల్ యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ బ్లాక్ ఫంగస్ కేసులకు మంచి మెడిసిన్ గా పని చేస్తుందని అంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో పలువురు బ్లాక్ ఫంగస్ రోగులు చికిత్స పొందుతున్నారు. వివిధ ఆసుపత్రుల్లో ఈ రోగులకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.