Commerce Ministry: దశాబ్దాల కాలం నాటి చట్టాల రద్దుపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతిపాదించిన వాణిజ్య మంత్రిత్వశాఖ!

|

Jan 31, 2022 | 12:59 PM

Commerce Ministry: పాత చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ రంగాల వృద్ధి కోసం కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని, వ్యాపారాల..

Commerce Ministry: దశాబ్దాల కాలం నాటి చట్టాల రద్దుపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతిపాదించిన వాణిజ్య మంత్రిత్వశాఖ!
Follow us on

Commerce Ministry: పాత చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ రంగాల వృద్ధి కోసం కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని, వ్యాపారాల కోసం మెరుగైన వాతావరణాన్ని రూపొందించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కొత్త బిల్లులను తీసుకొచ్చింది. సుగంధ ద్రవ్యాల డ్రాఫ్ట్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు 2022, రబ్బర్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు 2022, కాఫీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు 2022, టీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు 2022లను వాణిజ్య మంత్రిత్వ శాఖ తీసుకువచ్చింది.

ఇటీవల కాలంలో టీ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది. దీన్ని మార్కెట్ చేసే విధానం, వినియోగం కూడా చాలా మారింది. దీంతో ప్రస్తుతమున్న ఎన్నో ఏళ్ల నాటి చట్టాన్ని సవరించాల్సి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇలాగే టీ ప్రోత్సాహకానికి, టీ వర్కర్లు స్కిల్ డెవలప్‌మెంట్‌కు చర్యలు తీసుకోవాల్సి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో దశాబ్దాల నాటి టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, రబ్బరు చట్టాలకు కేంద్రం స్వస్తి చెప్పబోతోంది. సుగంధ ద్రవ్యాల డ్రాఫ్ట్‌ బిల్లు 2022, టీ బిల్లు 2022లను వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ఈ బిల్లులపై ఫిబ్రవరి 9వ తేదీ వరకు వాటాదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వాణిజ్య మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. టీ చట్టం 1953, సుగంధ ద్రవ్యాల చట్టం 1986, రబ్బర్‌ చట్టం 1947, కాఫీ చట్టం 1942ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త బిల్లులను వాణిజ్య మంత్రిత్వశాఖ తీసుకువచ్చింది. సుగంధ ద్రవ్యాల సరఫరా చెయన్‌పై ఫోకస్‌ చేసేలా బోర్డును ఏర్పాటు చేయాలని డ్రాఫ్ట్‌ బిల్లు ప్రతిపాదించింది. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాల రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి చట్టంలోని కొన్ని నిరూపయోగంగా ఉన్న నిబంధనలను తొలగించింది.

ఇవి కూడా చదవండి:

Railway Warehouse Workers: ఇండియన్‌ రైల్వేలో పని చేసే ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆ జాబితాలో వారి పేర్లు..!

Financial Calender: ముఖ్యమైన పనులు చేసుకునేందుకు ఈ నాలుగు తేదీలను గుర్తించుకోండి.. లేకపోతే ఇబ్బందులు పడతారు..!