Collector Vikas Mishra: ఆ జిల్లా కలెక్టర్‌ పనితీరుకు ముఖ్యమంత్రి సైతం అభిమాని.. అవినీతిపరుల పాలిట సింహ స్వప్నం..

|

Jan 03, 2023 | 4:53 PM

వికాస్ మిశ్రా దిండోరిలో ఉన్న గిరిజన బాలుర హాస్టల్‌కు వెళ్లారు. అప్పటికే హాస్టల్ వార్డెన్ మద్యం మత్తులో ఉన్నాడు. వెంటనే అతడిని సస్పెండ్ చేసి మరో అధికారిని నియమించారు. పిల్లలతో కలిసి క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు.

Collector Vikas Mishra: ఆ జిల్లా కలెక్టర్‌ పనితీరుకు ముఖ్యమంత్రి సైతం అభిమాని.. అవినీతిపరుల పాలిట సింహ స్వప్నం..
Collector Vikas Mishra
Follow us on

సాధారణంగా ప్రజలు ప్రభుత్వ అధికారులతో ఏదైనా పని చేయించుకోవాలంటే వారి కార్యాలయాల చుట్టూ తిరగాలి. అయినా కొందరు ప్రభుత్వ అధికారులు కనికరిస్తారని గ్యారంటీ లేదు. కానీ ఓ జిల్లా అధికారి ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను దగ్గరుండి అడిగి తెలుసుకొని మరీ పరిష్కరిస్తున్నారు. అందుకే ఆ జిల్లా కలెక్టర్‌కు ముఖ్యమంత్రి సైతం ఫ్యాన్‌ అయిపోయారు. ఆయనెవరంటే.. మధ్యప్రదేశ్‌ దిండోరి జిల్లా కలెక్టర్‌ వికాస్‌ మిశ్రా. 2013 బ్యాచ్‌కు చెందిన ఈ కలెక్టర్‌.. బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఇప్పటి వరకూ తెల్లవారుతూనే 5 గంటలనే ఇంటినుంచి బయలుదేరి గ్రామాల్లో వాలిపోతారు. అక్కడ గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. తానొక ప్రభుత్వ అధికారిననికూడా మర్చిపోయి,వారితో కలిసి నేలపైనే కూర్చుంటారు. తన మొబైల్ నంబర్‌ను వారికి ఇచ్చి ఏమైనా సమస్య వస్తే ఫోన్ చేయమని చెబుతారు.

ఇటీవల వికాస్ మిశ్రా దిండోరిలో ఉన్న గిరిజన బాలుర హాస్టల్‌కు వెళ్లారు. అప్పటికే హాస్టల్ వార్డెన్ మద్యం మత్తులో ఉన్నాడు. వెంటనే అతడిని సస్పెండ్ చేసి మరో అధికారిని నియమించారు. పిల్లలతో కలిసి క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు. హాస్టల్‌ విద్యార్థుల సమస్యలను వింటూ వారితో కలిసి భోజనం చేసి రాత్రి బస చేశారు. అతి త్వరలోనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, బాగా చదువుకోవాలని పిల్లలకు చెప్పి వెళ్లారు.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా దిండోరి కలెక్టర్ వికాస్ మిశ్రా పనితీరును ప్రశంసించారు. డిసెంబరు 28న ఓర్చాలో జరిగిన గర్కుందర్ ఉత్సవంలో వేదికపై నుంచి వికాస్ గురించి మాట్లాడారు. వికాస్‌కు తాను ఫ్యాన్ అయ్యానని, అతడిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన వారు కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని కొనియాడారు. దిండోరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వికాస్ ఒకరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలోని ప్రజలను కలుస్తూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..