బలపడుతున్న కాఫీడే..!

| Edited By: Ravi Kiran

Aug 19, 2019 | 5:56 PM

కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఓ వైపు రుణ భారాన్ని తగ్గించుకునే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్‌ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5 శాతానికి లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ అయింది. సిద్దార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో జులై […]

బలపడుతున్న కాఫీడే..!
Follow us on

కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఓ వైపు రుణ భారాన్ని తగ్గించుకునే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్‌ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5 శాతానికి లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ అయింది. సిద్దార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో జులై 26 నుంచి 68 శాతం పతనమైంది. పానీయాల రిటైల్‌ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ. 2, 400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. జులై చివరికల్లా గ్రూప్‌ రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ. 3472 కోట్లుగా పేర్కొంది. ఇదిలా ఉంటే కంపెనీలో వాటాను విక్రయించేందుకు కాఫీడేలో చర్చలు సాగుతున్నట్లుగా సమాచారం.