ఉన్నావ్ ఘటన దర్యాప్తుకు రెండు వారాల గడువు
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసు విచారణకు..సీబీఐకి మరో రెండు వారాల గడువిచ్చింది సుప్రీంకోర్ట్. బాధితురాలితో పాటు ఆమె లాయర్ స్టేట్ మెంట్ ఇంకా రికార్డ్ చేయనందున..తమకు 4 వారాల గడువు కావాలని కోరింది సీబీఐ. అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పేర్కొంది. దీంతో గడువును మరో రెండు వారాలు పొడిగించేందుకు అంగీకారం తెలిపింది కోర్టు. లాయర్ కు వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల మధ్యంతర పరిహారమివ్వాలని యూపీ ప్రభుత్వాన్ని […]
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసు విచారణకు..సీబీఐకి మరో రెండు వారాల గడువిచ్చింది సుప్రీంకోర్ట్. బాధితురాలితో పాటు ఆమె లాయర్ స్టేట్ మెంట్ ఇంకా రికార్డ్ చేయనందున..తమకు 4 వారాల గడువు కావాలని కోరింది సీబీఐ. అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పేర్కొంది. దీంతో గడువును మరో రెండు వారాలు పొడిగించేందుకు అంగీకారం తెలిపింది కోర్టు. లాయర్ కు వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయల మధ్యంతర పరిహారమివ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.