CM Yogi Adityanath: ఆ ఇద్దరే కాంగ్రెస్‌ను ఖతం చేస్తారు.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచనల వ్యాఖ్యలు..

|

Feb 14, 2022 | 1:46 PM

కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి మరెవరూ అవసరం లేదని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు చాలని ఎద్దేవ చేశారు. రాహుల్, ప్రియాంక  స్వయంగా ఆ పని చేస్తారని జోస్యం చెప్పారు.

CM Yogi Adityanath: ఆ ఇద్దరే కాంగ్రెస్‌ను ఖతం చేస్తారు.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచనల వ్యాఖ్యలు..
Cm Yogi Adityanath
Follow us on

ఆ ఇద్దరే కాంగ్రెస్‌ను ఖతం చేస్తారు.. అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు సీఎం యోగీ. కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి మరెవరూ అవసరం లేదని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు చాలని ఎద్దేవ చేశారు. రాహుల్, ప్రియాంక  స్వయంగా ఆ పని చేస్తారని జోస్యం చెప్పారు. రెండో దశ పోలింగ్‌ సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి యోగి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు.

‘‘కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి, ఆ పార్టీని పడేయడానికి ఆ అన్నాచెల్లెళ్లు (రాహుల్, ప్రియాంకలను ఉద్దేశిస్తూ) చాలు. ఇంకెవరూ అవసరం లేదు.అలాంటి పార్టీకి ఎందుకు మద్దతివ్వాలి అని ప్రజలను అడుగుతున్నా’’ అంటూ యోగి ఈ సందర్బంగా ప్రశ్నించారు. రాహుల్‌, ప్రియాంకలపై యోగి గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేశారు.

ఆ అన్నాచెల్లెళ్ల మధ్య గొడవులు జరుగుతున్నాయని అన్నారు. అయితే, సీఎం యోగి చేసిన వ్యాఖ్యలను ప్రియాంక కొట్టిపారేశారు. ఇదిలావుంటే.. అంతకుముందు ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ” కాంగ్రెస్ పూర్తిగా మునిగిపోయింది.. ఎక్కడ తక్కువ ఉనికిలో ఉన్నా దానిని కిందకు నెట్టడానికి ఇద్దరు తోబుట్టువులు రెడీ ఉన్నారని అన్నారు. కాబట్టి దానిని దాని విధికి వదిలివేయాలి” అని అన్నారు.

ఇవి కూడా చదవండి: మూడు రాష్ట్రాల పోలింగ్ అప్ డేట్స్ ఇక్కడ చూడండి

High Protein Lentils: ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ పప్పు దినుసులను ఆహారంలో చేర్చుకోండి..