
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీ తాజాగా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కేరళకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ నేతల సమక్షంలో యూడీఎఫ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణలో మహిళా సాధికారత దిశగా సక్సెస్ అయ్యామని.. తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలు అమలుచేస్తున్నామన్నారు. కేరళలో ఇచ్చిన ఐదు గ్యారంటీలు కూడా అధికారంలోకి వచ్చాక అమలుచేస్తామన్నారు. కేరళలో హామీల అమలుకు తనదీ గ్యారంటీ అని రేవంత్ చెప్పుకొచ్చాడు. ఇంకో 20 నుంచి 25 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని.. ఎప్పుడు అవసరమొచ్చినా కేరళ ప్రజలకు అండగా ఉంటానన్నారు.
ఇదిలా ఉండగా యూడీఎఫ్ విడుదల చేసిన మేనిఫెస్టోలోని గ్యారెంటీలపై విమర్శలు చేస్తున్న వారికి సీఎం రేవంత్ గట్టి సవాల్ విసిరారు. మేము 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో తెలంగాణకు వచ్చి ప్రజలను అడగండి తెలుసుకోవాలన్నారు. సంవత్సరానికి రూ.18,000 కోట్ల రైతు భరోసా నిధులు ఇస్తున్నామని.. ఒకే ఏడాదిలో 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పాలనలో అక్కడ అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి.. తమ ట్రాక్ రికార్డు చెక్ చేసుకోవాలన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.