Rajasthan Political Crisis: ఢిల్లీకి చేరిన రాజస్థాన్‌ రాజకీయం.. సీఎం గెహ్లాట్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చిన అధిష్టానం దూతలు

|

Sep 27, 2022 | 8:54 PM

రాజస్థాన్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ రకరకాల ఎత్తుగడలను ప్రయోగిస్తోంది. హైకమాండ్‌ మాటే తనకు శిరోధార్యమని సోనియాకు స్పష్టం చేశారు సీఎం అశోక్‌ గెహ్లాట్‌ . సీఎం పదవిపై తొందరగా తేల్చేయాలని సచిన్‌ పైలట్‌ వర్గం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతోంది. సంక్షోభంలో గెహ్లాట్‌ పాత్ర లేదని హైకమాండ్‌ పరిశీలకుల నుంచి క్లీన్‌చిట్‌ లభించింది.

Rajasthan Political Crisis: ఢిల్లీకి చేరిన రాజస్థాన్‌ రాజకీయం.. సీఎం గెహ్లాట్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చిన అధిష్టానం దూతలు
Ashok Gehlot
Follow us on

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ రగడ ఢిల్లీకి చేరుకుంది. ఈసారైనా సీఎం పదవి దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న సచిన్‌ పైలట్‌ ఢిల్లీ చేరుకున్నారు. సోనియాగాంధీ , ప్రియాంకగాంధీతో ఆయన భేటీ అవుతున్నారు. పైలట్‌కు సీఎం పదవి ఇస్తామని గతంలోనే ప్రామిస్‌ చేశారు ప్రియాంక. సంక్షోభం తరువాత తొలిసారి సోనియాగాంధీతో మాట్లాడారు అశోక్‌ గెహ్లాట్‌ . అధిష్టానానికి ఎప్పుడు విధేయుడినే అని , ఎప్పుడు ధిక్కార స్వరం విన్పించలేదన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం దూతల నుంచి కూడా సంక్షోభంలో గెహ్లాట్‌ పాత్ర లేదని క్లీన్‌చిట్‌ లభించింది. ఇదే విషయాన్ని సోనియాకు ఇచ్చిన నివేదికలో తెలిపారు అజయ్‌ మాకెన్‌ , మల్లిఖార్జున్‌ ఖర్గే.

అశోక్ గెహ్లాట్ పార్టీ కాంగ్రెస్‌ అధ్యక్ష పద‌వికి పోటీప‌డాల‌ని నిర్ణయించుకుంటే ఇంకా సీఎంగా కొన‌సాగడం క‌రెక్ట్ కాద‌ని స‌చిన్ పైల‌ట్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా త‌నకు సీఎం ప‌ద‌వి ఇవ్వకూడ‌దంటూ గోల చేస్తున్న గెహ్లాట్ వ‌ర్గం ఎమ్మెల్యేల‌ను అదుపు చేయాల్సిన బాధ్యత కూడా ఆయ‌న‌పైనే ఉంద‌ని పైల‌ట్ అధిష్ఠానానికి స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.

మరోవైపు అశోక్‌ గెహ్లాట్‌ తీరుపై సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సీఎం పదవిపై హైకమాండ్‌ వెంటనే నిర్ణయం తీసుకోవాలని వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడన వాళ్లకు ఫలితం దక్కాలని , పైలట్‌కు ఇప్పటివరకు కూడా ఆ ఫలితం దక్కలేదని నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాజస్థాన్‌ సంక్షోభంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. సెప్టెంబర్‌ 30వరకు రాజస్థాన్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అశోక్‌ గెహ్లాట్‌ నామినేషన్‌ వేస్తారా ? లేదా ? అన్న విషయంపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది.

గెహ్లాట్‌కు సన్నిహితుడైన శాంతి ధరివాల్‌తో సమావేశం..

ధరివాల్‌లో జరిగిన సమావేశం కోసం కాంగ్రెస్ రాజస్థాన్ ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్, పరిశీలకుడు మల్లికార్జున్ ఖర్గేలను జైపూర్‌కు చేరుకున్నారు. ఈ శాసనసభా పక్ష సమావేశానికి ముందు కూడా గెహ్లాట్ సన్నిహితుడు శాంతి ధరివాల్ ఇంట్లో శాసనసభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం గెహ్లాట్‌కు మద్దతు ఇస్తున్న పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు స్పీకర్ సీపీ జోషి నివాసానికి చేరుకున్నారు. మంత్రి శాంతి ధరివాల్ ఇంట్లో జరిగిన ఈ సమావేశం కారణంగా శాసనసభా పక్ష సమావేశం రద్దయింది. దీని తర్వాత మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ కూడా ఢిల్లీకి తిరిగొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం