Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలోని దేవప్రయాగ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అకాల వర్షాలకు శాంతానది ఉప్పొంగింది. కొండచరియలు విరిగిపడి వరదల ధాటికి డజన్ల కొద్ది ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. రెండు మున్సిపల్ భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. పాదాచారుల బ్రిడ్జ్‌లు ధ్వంసం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మున్సిపల్ కమిషనర్ కేకే కోటియాల్ తెలిపారు.
Cloudburst in Uttarakhand’s Devprayag; shops, houses damaged.#TV9News #Uttarakhand pic.twitter.com/YTd9sS1Niv
— tv9gujarati (@tv9gujarati) May 11, 2021
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్ సహాయక బృందాలు అక్కడికక్కడే బయలుదేరాయి. ఇప్పటివరకు మరణాలు , గాయాల గురించి సమాచారం లేదు. కొండచరియ ఒక్కసారిగా విరిగిపడటంతో ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుతున్నాయని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఉత్తర్‌ఖండ్ సిఎం తీరత్ సింగ్ రావత్‌తో మాట్లాడి రాష్ట్రంలో వరదల వల్ల తలెత్తే పరిస్థితి గురించి ఆరా తీశారు. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Uttarakhand: Several shops and houses damaged due to a cloudburst in Tehri district's Devprayag area
"No casualties have been reported yet. SDRF teams are on their way to the spot," says DGP Ashok Kumar (in file photo) pic.twitter.com/8PlT1ave9L
— ANI (@ANI) May 11, 2021