సింఘు బోర్డర్‌లో సినిమాటిక్ సీన్, పోలీసులనే బెదిరించి వాహనంతో రైతు పరారీ, ఛేజ్ చేసి పట్టుకున్న ఖాకీలు
రైతుల ఆందోళనకు కేంద్ర బిందువుగా మారిన సింఘు బోర్డర్ లో మంగళవారం రాత్రి సినిమాటిక్ సీన్ ఒకటి చోటు చేసుకుంది. రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న..
రైతుల ఆందోళనకు కేంద్ర బిందువుగా మారిన సింఘు బోర్డర్ లో మంగళవారం రాత్రి సినిమాటిక్ సీన్ ఒకటి చోటు చేసుకుంది. రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతల్లో ఒకరు మద్యం తాగి ఆ మత్తులో వీరంగం సృష్టించాడు. తన పొడవైన కత్తితో పోలీసు వాహనంపైకి దూసుకెళ్లి పోలీసునే బెదిరించి ఆ వాహనంతో ముకాబ్రా చౌక్ అనే ప్రాంతవైపు దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఖాకీలు వెంబడించడంతో ఆ వాహనాన్ని ఒక చోట వదిలేసి ఓ స్కూటీ పై పరారయ్యాడు. అయితే పట్టు వదలని పోలీసులు మళ్ళీ అతడ్ని ఛేజ్ చేసి పట్టుకోబోగా తన కత్తితో ఓ పోలీసు అధికారిపై దాడిచేసి అతని మెడను గాయపరిచాడు. చివరకు అతి కష్టం మీద ఆ తాగుబోతు రైతును వారు పట్టుకోగలిగారు. అతడిని పంజాబ్ కు చెందిన హర్ ప్రీత్ గా గుర్తించారు. హత్యా యత్నంతో సహా అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ప్రశాంతంగా ఉన్న సింగు బోర్డర్ లో ఈ ఘటన కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనకు, తమకు సంబంధం లేదని రైతు సంఘాలు అంటున్నాయి.
Read More:
Cute Baby Cow : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న అరుదైన పుంగనూరు జాతి ఆవు దూడ..