Gaya Chinese Woman in Police Custody: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న చైనా మహిళను బీహార్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. దలైలామా పర్యటన సందర్భంగా బీహార్‌లోని బోద్‌గయాలో ఈ ఉదయం భద్రతా హెచ్చరికలు జారీ చేసిన తర్వాత, చైనా మహిళ కోసం అధికారులు వెతుకుతున్నారు. బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళను కనుగొన్నారని, బోద్ గయా పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుగుతోందని తెలుస్తోంది.
మిస్ సాంగ్ జియోలాన్ అనే చైనా మహిళను గురువారం సాయంత్రం బోధ్ గయలోని కాలచక్ర మైదాన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ బౌద్ధ సన్యాసి వేషంలో ఉంది. ఆమె 2020 సంవత్సరం నుంచి బోద్ గయలో ఉన్నారని లెలుస్తోంది. ఈ మధ్య నేపాల్‌కి కూడా వెళ్లింది. ఆమె చైనాలో వాలంటీర్‌గా పనిచేసేదంట.
బోధ్‌గయాలోని గెస్ట్‌హౌస్‌లో చైనా మహిళను అదుపులోకి తీసుకున్నట్లు గయా సిటీ ఎస్పీ అశోక్ ప్రసాద్ తెలిపారు. ఆమెను బోద్‌గయ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఆమె 2020 నుంచి భారతదేశంలో నివసిస్తుందంట. మహిళకు 2024 వరకు వీసా ఉంది. ప్రాథమికంగా చూస్తే ఏ గూఢచర్యానికి సంబంధించిన అంశం ఇంకా తెరపైకి రాలేదు. విచారణ జరుగుతోంది. మహిళ వయస్సు 50 సంవత్సరాలుగా పోలీసులు పేర్కొన్నారు.
Bihar | Police detain the suspected (Chinese) woman in Bodh Gaya in connection with alleged threat to Tibetan spiritual leader Dalai Lama. She is being interrogated: JS Gangwar, ADG (headquarters) confirms to ANI
(file pic) https://t.co/32hSwYnxPN pic.twitter.com/f6AsNpMCiH
— ANI (@ANI) December 29, 2022
కాగా, గురువారం నుంచి కాలచక్ర మైదాన్‌లో దలైలామా మూడు రోజుల ఉపన్యాసం ప్రారంభమైంది. ఇక్కడ నుంచే చైనా మహిళను కూడా అరెస్టు చేయడమే గమనార్హం. గురువారం ఉదయం మహిళ గురించిన సమాచారం పోలీసులకు అందిన వెంటనే తొలి స్కెచ్ బయటపడింది. వెంటనే పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. సాయంత్రం, కాలచక్ర మైదాన్ సమీపంలో మహిళను పట్టుకున్నారు.
నిజానికి, దలైలామా ఒక నెల బసలో ఉన్నారు. ఆయన బోధ్ గయలో మాత్రమే ఉంటారు. ఆయన కార్యక్రమానికి 50కి పైగా దేశాల నుంచి దాదాపు రెండు లక్షల మంది బౌద్ధ భక్తులు హాజరవుతారని అంచనా. దలైలామాపై గూఢచర్యం చేస్తున్న మహిళ గురించి వెల్లడైంది. ఉపన్యాస కార్యక్రమం ప్రారంభమైన తొలిరోజే ఈ వార్త తెరపైకి రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న తరువాత, పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇప్పుడు మహిళ పట్టుబడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి అసలు విషయం ఏంటనేది విచారణ తర్వాత తేలుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..