భారత పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ నుంచి తమకు రావలసిన బకాయిల కోసం చైనా లోని బ్యాంకులు నడుం బిగించాయి. ఈ బ్యాంకులకు ఆయన రూ. 5,276 కోట్ల రుణాలను చెల్లించవలసి ఉంది. వీటిని రాబట్టేందుకు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎక్స్ పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా తదితర బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా గల అంబానీ ఆస్తులపై తమ హక్కులను పొందాలని యోచిస్తున్నాయి. తమకు కనీసం ఒక్క పెన్నీ అయినా చెల్లించకుండా చూసేందుకు అనిల్ అంబానీ నానాపాట్లు పడుతున్నారని ఈ బ్యాంకుల తరఫు ప్రతినిధి బంకిం థంకి లండన్ లోని హైకోర్టుకు తెలిపారు.
అయితే వరల్డ్ వైడ్ గా గల అంబానీ ఆస్తులపై హక్కులను పొందాలంటే అంత సులభమేమీ కాదు. ఈ బ్యాంకుల ప్రతిపాదనను అనిల్ అంబానీ కోర్టులో సవాలు చేయవచ్చు. ఆయన తరఫు లాయర్లు దీన్ని సవాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.