India-China: భారత్‌పై చైనా కుట్రలు మరోసారి బట్టబయలు.. అమెరికా రక్షణ శాఖ వార్షిక నివేదికలో కీలక విషయాలు!

|

Nov 06, 2021 | 7:51 AM

డ్రాగన్ కుట్రలు మరోసారి బయటపడ్డాయి. భారత్‌పై చైనా కుట్రలను గుర్తించింది అంతర్జాతీయ సమాజం. చైనా సైన్యం హద్దు దాటి ప్రవర్తిస్తోందని మరోసారి స్పష్టమైంది.

India-China: భారత్‌పై చైనా కుట్రలు మరోసారి బట్టబయలు.. అమెరికా రక్షణ శాఖ వార్షిక నివేదికలో కీలక విషయాలు!
China Built Village Inside Disputed Territory
Follow us on

China built Village in Arunachal Pradesh: డ్రాగన్ కుట్రలు మరోసారి బయటపడ్డాయి. భారత్‌పై చైనా కుట్రలను గుర్తించింది అంతర్జాతీయ సమాజం. చైనా సైన్యం హద్దు దాటి ప్రవర్తిస్తోందని మరోసారి స్పష్టమైంది.
భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్తత‌లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవాధీన రేఖ దాటి వచ్చి అరుణాచల్ ప్రదేశ్‌లో 100 ఇళ్లతో కొత్త గ్రామాన్ని సృష్టించుకుంది చైనా. దీనికి సంబంధించిన నివేదికను యూఎస్‌ కాంగ్రెస్‌కు సమర్పించింది అమెరికా రక్షణ శాఖ.

భారత భూ భాగంగా గుర్తించిన ప్రాంతంలోనే చైనా ఈ నిర్మాణం చేపట్టడం గమనార్హం. మెక్‌మోహన్‌ రేఖ‌కు ద‌క్షిణాన భార‌త స‌రిహ‌ద్దుల్లో ఈ గ్రామం నిర్మించార‌ని బ‌య‌ట‌ప‌డింది. అరుణ‌చ‌ల్‌ప్రదేశ్‌లో డ్రాగన్‌ దేశం ఒక గ్రామాన్నే నిర్మించిన విష‌య‌ంపై శాటిలైట్ చాయాచిత్రం ఆధారంగా ఓ జాతీయ మీడియా ఈ ఏడాది ప్రారంభంలో ఓ వార్తా కథ‌నం ప్రచురించింది. 2020లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఎల్‌ఏటీ తూర్పు సెక్టార్‌లో టిబెట్‌ అటానమస్ రీజియన్, భారత్‌లోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య వివాదాస్పద భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని నిర్మించింది అని ఓ నివేదిక వెల్లడించింది. ఈ గ్రామం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని సారి చు నది ఒడ్డున ఉంది.

ఈ ప్రాంతం 1962 యుద్ధానికి ముందు కూడా భారతదేశం- చైనా సైనికుల మధ్య ఘర్షణలను దారితీసింది. చైనా పదేళ్లకు పైగా ఈ ప్రాంతంలో చిన్న సైనిక స్థావరాన్ని నిర్వహిస్తోంది. అయితే భారత భూభాగంలోకి మరింత చొచ్చుకొని 2020లో అది పూర్తి స్థాయి గ్రామాన్ని నిర్మించుకుంది. అంతేకాకుండా అదే ప్రాంతంలో రహదారి నిర్మాణాలు కూడా ఏర్పాటు చేస్తోంది డ్రాగన్ దేశం. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఎల్ఏసీ వద్ద చైనా వ్యూహాత్మక చర్యలను కొనసాగిస్తోందని వెల్లడించింది అమెరికా నివేదిక. కేవలం భారత్‌తోనే కాదు, ఇతర దేశాల తోనూ కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఇటీవలే తైవాన్‌ దేశంలోని అనుమతి లేకుండా యుద్ధ విమానాలు పంపింది డ్రాగన్ దేశం.

Read Also…  ISRO Recruitment: హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ చేయగలరా.? ఇస్రోలో ఉద్యోగం పొందే అవకాశం. పూర్తి వివరాలు..