Covid Vaccine: 15-18 ఏళ్ల టీనేజర్లకు గుడ్‌న్యూస్.. కోవిన్‌‌లో రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే..?

|

Dec 27, 2021 | 2:15 PM

Children Covid Vaccine: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వరకు

Covid Vaccine: 15-18 ఏళ్ల టీనేజర్లకు గుడ్‌న్యూస్.. కోవిన్‌‌లో రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే..?
Children Covid Vaccine
Follow us on

Children Covid Vaccine: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 18 ఏళ్లకు పైబడిన వారికి వాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నామని.. ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ప్రకటించారు. దీనిలో భాగంగా సోమవారం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు కోవిన్ ప్లాట్‌ఫామ్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. వీరంతా కోవిన్ యాప్‌లో జనవరి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

అయితే.. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ను స్టూడెంట్ ఐడీ కార్డుతో చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు డాక్టర్ శర్మ తెలిపారు. కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో అదనంగా టెన్త్ ఐడీ కార్డు రిజిస్ట్రేషన్‌ను యాడ్ చేసినట్లు ఆయన వివరించారు. ఆధార్ కార్డు లేని వారికి ఈ ఆప్షన్ వర్తింస్తుందని.. అందరూ గమనించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ అనంతరం 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

కాగా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రధాని మోదీ శనివారం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో బూస్టర్ డోసుతోపాటు 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఒమిక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

Also Read:

Omicron: ఆస్ట్రేలియాను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. కరోనా కొత్త వేరియంట్‌ తొలి మరణం నమోదు..

షాకింగ్ ఘటన.. కరోనా వ్యాక్సిన్ తీసుకోమన్నందుకు.. ఏకంగా పోలీసు అధికారి చేయి విరగ్గొట్టాడు..