Chief Justice Of India: తమను ముద్దాయిలు టార్గెట్ చేస్తారనే కోర్టులు బెయిల్ ఇవ్వడంలేదా..? సీజేఐ కీలక ప్రసంగం..

|

Nov 20, 2022 | 10:08 AM

దేశంలోని కోర్టుల్లో పెండింగ్‌ కేసులకు వీలైనంత త్వరగా తీర్పులను ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కోరారు. దేశంలోని ఏ పౌరుడికీ న్యాయం చేయడంలో జాప్యం జరగకూడదని, కోర్టుల్లో పెండింగ్‌లో..

Chief Justice Of India: తమను ముద్దాయిలు టార్గెట్ చేస్తారనే కోర్టులు బెయిల్ ఇవ్వడంలేదా..? సీజేఐ కీలక ప్రసంగం..
Cji Dy Chandrachud
Follow us on

దేశంలోని కోర్టుల్లో పెండింగ్‌ కేసులకు వీలైనంత త్వరగా తీర్పులను ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కోరారు.  దేశంలోని ఏ పౌరుడికీ న్యాయం చేయడంలో జాప్యం జరగకూడదని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని మాజీ సీజేఐ యూయూ లలిత్‌లాగే ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..విడుదలయిన ముద్దాయిలు, నిందితులు తమను టార్గెట్ చేస్తారనే భయంతో జిల్లా కోర్టుల న్యాయమూర్తులు బెయిల్ మంజూరు చేసేందుకు వెనుకాడుతున్నారని అన్నారు. కింది కోర్టులలో బెయిల్ మంజూరు కాకపోవడంతో బెయిల్ పిటిషన్లు హైకోర్టులను చెత్తుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.  ”దేశంలోని న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఎంత ముఖ్యమో జిల్లా కోర్టులు కూడా అంతే ముఖ్యమైనవి. కింది కోర్టుల న్యాయమూర్తులు ముద్దాయిలకు, నిందితులకు బెయిల్ మంజూరు చేయడానికి వెనుకాడుతున్నారు. నేరం తీవ్రతను అర్థం చేసుకోకపోవడం వల్ల కాదు, చాలా దారుణమైన కేసుల్లో బెయిల్ వస్తే తమను టార్గెట్ చేస్తారనే భయం వారిలో ఉంది. వారి భయం కారణంగా  బెయిల్ పిటిషన్లతో హైకోర్టులు ముంచెత్తిపోతున్నాయి.  ప్రజలు జిల్లా కోర్టులను విశ్వసించడం చాలా ముఖ్యమైన విషయం. న్యాయం కోరే సాధారణ పౌరుల అవసరాలకు  స్థానిక కోర్టులు, జిల్లా స్థాయి కోర్టులు నిజంగా ఉపయోగపడతాయ”ని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు.

సీజేఐ చంద్రచూడ్ న్యాయవ్యవస్థ, జిల్లా న్యాయవ్యవస్థ, న్యాయపరమైన మౌలిక సదుపాయాలు, న్యాయ విద్య, న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం, సాంకేతికత వినియోగం గురించి కూడా మాట్లాడారు. సీజేఐగా చంద్రచూడ్ నియామకం సందర్భంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కూడా పాల్గొన్నారు. బదిలీలకు సంబంధించి పలువురు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తిని కలవాలన్న కోరికపై రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ”బదిలీ విషయమై కొందరు న్యాయవాదులు సీజేఐని కలవాలనుకుంటున్నారని విన్నాను. ఇది వ్యక్తిగత విషయం కావచ్చు, కానీ మీరు విడిగా చూస్తే, చాలా సమస్యలలో కూడుకున్న విషయం ఇది. అయితే, కొలీజియం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఇది పునరావృతమయ్యే సంఘటనగా మారితే, ప్రభుత్వం మద్దతు ఇస్తూనే ఉంటే, అది ఎంత వరకు వెళ్తుంది. అటువంటి పరిస్థితిలో, మొత్తం పరిమాణం మారుతుంది” అని అన్నారు.

బార్ అసోసియేషన్ సమావేశానికి చంద్రచూడ్ సిద్ధం..

ప్రస్తుత లాయర్ల పనితీరు దృష్ట్యా నవంబర్ 21న గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్‌ను కలవడానికి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అంగీకరించారని సంబంధిత అధికారులు తెలిపారు. జస్టిస్ నిఖిల్ ఎస్. కరియాల్‌ను పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం సిఫారసును కొందరు వ్యతిరేకిస్తున్నారు. పరిపాలనా కారణాల రీత్యా ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం ఇటీవల సిఫార్సు చేసినట్టు ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే..