Chicken Masala: దీపావళి గిఫ్ట్‌గా.. ఆలయ ఉద్యోగులకు చికెన్‌ మసాలా ప్యాకెట్లు అందజేత!

దీపావళి పండగ చాలా మందికి ఎంతో స్పెషల్. ఈ పండక్కి దేశంలో పలు కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఆయా యాజమన్యాలు బోనస్‌, గిఫ్ట్స్‌ అంటూ రకరకాల బహుమతులు ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు మరో అడుగు ముందుకేసి తమ సిబ్బందికి లగ్జరీ కార్లు, బైక్‌లు, నగలు, అపార్ట్‌మెంట్‌లను కూడా అందిస్తున్నాయి. సాధారణంగా పండగ సందర్భంగా..

Chicken Masala: దీపావళి గిఫ్ట్‌గా.. ఆలయ ఉద్యోగులకు చికెన్‌ మసాలా ప్యాకెట్లు అందజేత!
Chicken Masala As Diwali Gift To Temple Employees

Updated on: Oct 18, 2025 | 6:06 PM

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశంలో పలు కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఆయా యాజమన్యాలు బోనస్‌, గిఫ్ట్స్‌ అంటూ రకరకాల బహుమతులు ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు మరో అడుగు ముందుకేసి తమ సిబ్బందికి లగ్జరీ కార్లు, బైక్‌లు, నగలు, అపార్ట్‌మెంట్‌లను కూడా అందిస్తున్నాయి. సాధారణంగా పండగ సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్లు, ట్రాలీలు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు ఇచ్చి సంతోషపరుస్తుంటాయి. అయితే ఓ ఆలయంలోని ఉద్యోగులకు మాత్రం దిపావళి గిఫ్ట్‌లుగా దిమ్మతిరిగే బహుమతులు రావడంతో పరేషానయ్యారు. అంతేనా ఊరంతా ఏకమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇంతకీ గిఫ్ట్‌గా ఏం ఇచ్చారంటే..

మహారాష్ట్రలోని పంఢర్‌పూర్‌లోని విఠల్ ఆలయం స్థానికంగా ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయంలో పనిచేసే ఉద్యోగులు అసాధారణమైన దీపావళి బహుమతిని అందుకున్నారు. విఠల్‌ ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు నుంచి ఇతర ఉద్యోగులతో సహా అవుట్‌సోర్స్ సిబ్బంది మొత్తానికి దీపావళి గిఫ్ట్‌గా చికెన్‌ మసాలా ప్యాకెట్లను అందించారు. BVG కంపెనీ కంపెనీ ఆలయ ఉద్యోగులకు చికెన్ మసాలా ప్యాకెట్లు పంచడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిజానికి విఠల్ ఆలయం ఎంత పవిత్ర స్థలం. నిత్యం ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ఎంతో నిష్టతో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శాఖాహారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పే పవిత్ర స్థలం ఇది. ఇంతటి పవిత్ర ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు చికెన్‌ మసాలా ప్యాకెట్లు పంచడం స్థానికంగా చర్చకు దారితీసింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.