Women Commando: తుపాకీ చేతబట్టి అడవుల్లో గస్తీకి అతివలు.. దండకారణ్యంలోకి దంతేశ్వరి మహిళా కమాండోలు

|

Jul 27, 2021 | 7:07 PM

ఈ పోటీ ప్రపంచంలో.. మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు.. రాణిస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులు ఏరివేతలో కూడా ముందుకొచ్చారు మహిళా కమోండోలు.

Women Commando: తుపాకీ చేతబట్టి అడవుల్లో గస్తీకి అతివలు.. దండకారణ్యంలోకి దంతేశ్వరి మహిళా కమాండోలు
Chhattisgarh Women Commando
Follow us on

Chhattisgarh Women Commando: ఈ పోటీ ప్రపంచంలో.. మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు.. రాణిస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులు ఏరివేతలో కూడా ముందుకొచ్చారు మహిళా కమోండోలు. ఆది ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం.. అక్కడ ఎంట్రీ ఇచ్చారు దంతేశ్వరి కమోండోలు..

మహిళలు తాము అన్ని రంగాల్లో మగవారితో సమానం అని ముందుకు దూసుకెళుతున్న సమయం ఇది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నక్సల్స్‌ను ఏరివేస్తూ అక్కడి శాంతి భద్రతలను కాపాడేందుకు తుపాకీ చేతబట్టి అడవుల్లో గస్తీ కాసేందుకు సిద్ధంమయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్ ప్రభావం ఎక్కువ అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. అక్కడ నక్సల్స్ దాడుల్లో ప్రతి సంవత్సరం పోలీసులతో సహా ఎందరో సాధారణ ప్రజలు కూడా ప్రాణాలను కోల్పోవడం నిత్యకృత్యమైన విషయం. ఈ లాంటి కఠినమైన ప్రదేశంలో దంతేశ్వరీ మహిళా కమాండోల పేరుతో ముందుకు వచ్చారు ఇక్కడ చూస్తున్నా ఈ మహిళా పోలీసులు..

ఈ పోలీస్ మహిళలందరూ.. మహిళాలందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నన్నారు దంతేవాడ జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్.. ఈయన నేతృత్వంలో వర్షాకాల సమయంలోనే.. ప్రత్యేకంగా మావోయిస్టుల ఏరివేత కోసం వీరికి ప్రత్యేకంగా, కఠినమైన శిక్షణలు ఇచ్చారు. మావోయిస్టుల ఏరివేత కోసం కొండలు, గుట్టలు, వాగులు అతి ప్రమాదకరమైన ప్రాంతాల్లో.. ఆపరేషన్స్ కోసం పాల్గొనేలా తీర్చిదిద్దారు ఎస్పీ అభిషేక్ పల్లవ్.

మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం డిఆర్ డి జవానులతో పాటుగా, దంతేశ్వరి మహిళా కమాండోస్‌కు అత్యాధునిక ఆయుధాలతో పాటుగా ఎటువంటి వర్షాభావ పరిస్థితి అయినా ఎదురుకునేందుకు సిద్ధహస్తులను చేశారు. అదే విధంగా కిట్లు, షూలు ఇచ్చి. దండకారణ్యంలోకి మావోయిస్టులపై యుద్దానికి పంపించారు దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్. ఈనెల 28 నుంచి మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మావోలు వారి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు మొట్టమొదటిసారిగా దంతేశ్వరి మహిళా కమాండోలు అడవిలోకి వెళుతున్నారు. ఈ ఆపరేషన్లో మావోయిస్టులపై పట్టు సాధించాలని ఎస్పీ అభిషేక్ పల్లవ్ వ్యూహాలు రచించారు.

Read Also…  AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్..