Maoist Kidnap: ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. భర్త కోసం చంటి బిడ్డతో అడవిబాట పట్టిన భార్య..
Maoist Kidnap: మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను విడిపించుకోవడం కోసం అతని భార్య చంటి బిడ్డను చంకనేసుకుని అడవిబాట పట్టింది. ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.

Maoist Kidnap: మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను విడిపించుకోవడం కోసం అతని భార్య చంటి బిడ్డను చంకనేసుకుని అడవిబాట పట్టింది. ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లిన పీఎంసీఎస్‌వై సబ్ ఇంజనీర్‌ను ఇటీవల మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అతన్ని విడిపించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆందోళనకు గురైన బాధిత మహిళ.. తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ మావోయిస్టుల ప్రాంతాన్ని వెతుక్కుంటూ అడవిబాటపట్టింది.
నవంబరు 11న పీఎంజీఎస్‌వై సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్, అటెండర్ లక్ష్మణ్ కలిసి బీజాపూర్ జిల్లా, మాన్‌కేళి లోని ఘడ్ గోర్ణ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరిని మావోయిస్టులు అపహరించుకుపోయారు. ఆ తరువాత నవంబరు 12వ తేదీన అడెండర్ లక్ష్మణ్‌ను విడిచిపెట్టారు. సబ్ ఇంజనీర్‌ను మాత్రం ఇంకా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ క్రమంలో సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ భార్య అర్పిత తన భర్తను విడిచి పెట్టాలని మావోయిస్టులను వేడుకుంది. ఈ క్రమంలో తన రెండేళ్ల కుమారుడితో కలిసి మావోయిస్టుల చెంతకు వెళ్ళేందుకు అడవి బాటపట్టింది. అజయ్ రోషన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని అతని భార్య, కుటుంబ సభ్యులు మావోలను వేడుకుంటున్నారు. మరి మావోయిస్టులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Also read:
Emotional friendship: స్నేహమంటే ఇదేరా..! కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్లు..
Ecuador Prison Riots: ఈక్వెడార్ జైలులో మళ్లీ చెలరేగిన హింస.. 68 మంది మృతి..