అర్ధరాత్రి శ్మశానంలో క్షుద్ర పూజలు.. ఆ శక్తుల కోసం మంత్రగాడిని చంపి రక్తం తాగిన శిశ్యుడు.. చివరకు..

|

Feb 04, 2023 | 9:31 AM

ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడే దారుణంగా చంపి రక్తం తాగాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

అర్ధరాత్రి శ్మశానంలో క్షుద్ర పూజలు.. ఆ శక్తుల కోసం మంత్రగాడిని చంపి రక్తం తాగిన శిశ్యుడు.. చివరకు..
Black Magic
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడే దారుణంగా చంపి రక్తం తాగాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసంత్‌ సాహు (50) అనే వ్యక్తి దగ్గర నిందితుడు రౌనక్‌ సింగ్‌ ఛబ్రా అలియాస్‌ మన్య (25) క్షుద్రపూజలు నేర్చుకుంటున్నాడు. అయితే, శిష్యుడు తంత్ర-మంత్ర విద్యలో ప్రావీణ్యం పొందాలనుకున్నాడు. బసంత్‌ను చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్రపూజలు చేసే శక్తులు తనకూ వస్తాయని భావించాడు. బసంత్‌ క్షుద్రపూజలు చేస్తుండగా దాడి చేశాడు. శిష్యుడు మొదట తన గురువు తలపై కర్రతో కొట్టాడు. ఆ తర్వాత గురువు రక్తం బయటకు రాగానే.. రక్తం తాగడం ప్రారంభించాడు. ఆ తర్వాత గురువు గారి ప్రైవేట్‌ భాగంలో కర్ర పెట్టి సజీవ దహనం చేశాడు. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుణ్ని అరెస్టు చేసినట్లు ధామ్‌తరీ పోలీసులు తెలిపారు.

ప్యారీ సోడూర్ నది ఒడ్డున శంసన్ ఘాట్ సమీపంలో సగం కాలిన మృతదేహం పడి ఉందని ధామ్‌తరి పోలీసులకు ఇన్‌ఫార్మర్ నుంచి సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తన తండ్రి జనవరి రాత్రి 8 గంటల సమయంలో రౌనక్‌సింగ్‌ ఛబ్రా అనే వ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్లాడని సోమవారం మార్కెట్‌ నయాపారా పోలీస్‌ స్టేషన్‌లో దేవేంద్ర సాహు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రౌనక్ సింగ్ ఛబ్రాను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. తంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చంపి, అతని రక్తాన్ని తాగితే, తంత్ర సాధక్‌కు ఆ శక్తులన్నీ లభిస్తాయని నిందితుడు రౌనక్ సింగ్ ఛబ్రాతో ఒక సాధు చెప్పడంతో అలా చేసినట్లు వెల్లడించాడు.

మృతుడు బసంత్ సాహు.. నిందితుడు రౌనక్ జనవరి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరూ తంత్ర సాధన కోసం శ్మశాన వాటిక చేరుకుని పూజలు చేశారు. పూజలు చేస్తున్న సమయంలో రౌనక్ సింగ్ అలియాస్ మాన్య చావ్లా, తన గురువు బసంత్ సాహును అతని తలపై కర్రతో కొట్టి, రక్తాన్ని తాగాడని పోలీసులు తెలిపారు. బసంత్ జననాంగాలలో కర్ర పెట్టి కాల్చాడనన్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..