AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సీన్‌కు భయపడిన భర్త.. భార్య ఆధార్ కార్డ్ తీసుకుని చెట్టెక్కాడు.. ఆ తరవాతే అసలు ట్విస్ట్..

Covid Vaccine: కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. గ్రామాలు, తాండాలు ఇలా...

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సీన్‌కు భయపడిన భర్త.. భార్య ఆధార్ కార్డ్ తీసుకుని చెట్టెక్కాడు.. ఆ తరవాతే అసలు ట్విస్ట్..
Man Climbs Tree
Shiva Prajapati
|

Updated on: Jun 25, 2021 | 2:00 PM

Share

Covid Vaccine: కరోనా వైరస్‌ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. గ్రామాలు, తాండాలు ఇలా అన్ని చోట్లా ప్రజలకు వ్యాక్సీన్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల లక్ష్యాన్ని మించి ఒకటిన్నర రెట్లు టీకాలు వేయించారు. వ్యాక్సీనేషన్ కార్యక్రమం ఇంత ఉధృతంగా జరుగుతున్నా.. మరోవైపు వ్యతిరేక ప్రచారం కూడా అంతే స్థాయిలో జరుగుతోంది. టీకా వేసుకుంటే ఏదో జరిగిపోతుందని, ప్రాణాలే పోతాయంటూ దుష్ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారాన్ని నమ్మిన కొందరు ప్రజలు టీకా వేసుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదు. పైగా లేనిపోని భయాందోళనతో ఇతరులను కూడా ప్రలోభానికి గురిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఛత్తీ్స్‌గఢ్ జిల్లాలో వెలుగు చూసింది.

రాజ్‌గఢ్ జిల్లాలోని పటాన్ కాలా గ్రామంలో ఇలాంటి పరిస్థితినే వైద్యాధికారులు ఎదుర్కొన్నాడు. కోవిడ్ వ్యాక్సీన్‌కు భయపడి ఓ వ్యక్తి చెట్టు ఎక్కాడు. గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసే వరకు కిందకు దిగలేదు. చివరికి వ్యాక్సినేషన్ సిబ్బంది వెళ్లిపోయాక కిందకు వచ్చాడు. వ్యాక్సీనేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు పటాన్ కాలా గ్రామానికి టీకాలు వేసేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన కన్వర్ లాల్‌ను టీకా తీసుకునేందుకు పిలిచారు. కన్వర్ లాల్ భార్యకు టీకా ప్రయోజనాలు వివరించి. ఆమెకు టీకా వేసేందుకు గ్రామ పెద్దలు టీకా కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కన్వర్ లాల్ తన భార్య ఆధార్ కార్డు తీసుకునిపోయి ఒక చెట్టు ఎక్కాడు. తమకు ఏ టీకా అవసరం లేదని, టీకా తీసుకుంటే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. టీకా వొద్దని, తాను చెట్టు దిగే ప్రసక్తే లేదని మొండికేసాడు. చివరికి టీకా కార్యక్రమం అయిపోయాక గానీ కిందకు దిగలేదు.

ఇదిలాఉంటే.. పటాన్ కాలా గ్రామంలో టీకా వేసుకునేందుకు మిగతా గ్రామస్తులంతా ఉత్సాహం కనబరిచారు. టీకా కోసం పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వ్యాక్సినేషన్ సెంటర్‌కు చేరుకున్నారు. అయితే, వ్యాక్సీన్ తీసుకోవడానికి భయపడి చెట్టు ఎక్కిన వ్యక్తి వ్యవహారం ఉన్నతాధికారులకు చేరింది. దాంతో వారు ప్రత్యేకంగా గ్రామానికి వచ్చి, కన్వర్‌లాల్‌ని కలుస్తామని అధికారులు చెప్పారు. టీకా పట్ల కన్వర్‌లాల్‌కు ఉన్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసి అతనికి, అతని భార్యకు టీకా వేస్తామని చెప్పారు. ఏదేమైనా.. టీకా భయంతో కన్వర్‌లాల్ చెట్టు ఎక్కిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Post Covid Problems: కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లో  ‘ఎంఐఎస్-సి’..జాగ్రత్తలు తీసుకోవాలంటున్నకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ