
భార్యలకు భర్తలు భరణం చెల్లించే అంశంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఘటుగా స్పందించింది. ఓ వరకట్న వేధింపుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన కారణంగా లేకుండా ఏ భార్య అయితే భర్త నుంచి విడాకులు కోరుతుందో ఆమెకు భరణం తీసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ పెళ్లైన నాలుగు రోజులకే తన అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. భర్తతో పాటు అత్తమామలు తనను మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించింది. అత్తమామలు రూ.10లక్షల నగదుతో పాటు, కారు డిమాండ్ చేసినట్టు పేర్కొంది
అనంతరం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 125 కింద భరణం కోరుతూ ఛత్తీస్‌గఢ్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే మొదట బిలాస్ పూర్ ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి భర్తను పిలిచి విచారించగా అతను మాత్రం తాను తన భార్యతో కలిసి కాపురం చేయాలి అనుకుంటున్నట్టు స్పష్టంగా చెప్పాడు. దీంతో భర్త మాటలతో ఏకీభవించిన ప్యామిలీ కోర్టు భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ఆమెకు భర్త భరణం ఇచ్చేందుకు నిరాకరించింది.
అయితే బిలాస్‌పూర్ ఫ్యామిలీ కోర్టు తీర్పును చత్తీస్‌గఢ్ హైకోర్టు పూర్తిగా సమర్దించింది. భార్య తన భర్త నుంచి విడిగా ఉండాలనుకునేందుకు చట్టబద్ధమైన, సహేతుకమైన కారణాలు ఏవి చూపించక లేకపోయిందని హైకోర్టు పేర్కొంది. భర్త భార్యతో కలిసి ఉండి సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి సుముఖంగా ఉన్నా, భార్య తనంతటు తానే అత్తింటిని వదిలి వెళ్లి తిరిగి రావడానికి నిరాకరిస్తే, ఆమె భరణానికి అనర్హురాలని స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సీఆర్పీసీ 125 సెక్షన్‌ను ఉదహరిస్తూ, “తగిన కారణం లేకుండా విడిగా నివసించే భార్యకు భర్త ఎలాంటి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చట్టమే చెబుతోందని హైకోర్టు గుర్తుచేసింది. చట్టబద్దంగా భరణం అనేది కేవలం భర్తల పట్ల బాధితులైన, లేదా క్రూరత్వంగా హింసించబడుతున్న భార్యలకు రక్షణగా ఉండేందుకు ఉద్దేశించబడిందని.. ఎలాంటి కారణాలు లేకుండా విడపోవాలనుకునే వారికి సరైన న్యాయ కారణం లేకుండా వాడుకునే ఆయుధం కాదని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.