Bemetara Blast: గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. అంతకంతకు పెరుగుతున్న మృత్యుల సంఖ్య

|

May 25, 2024 | 2:20 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా బెర్లా పిర్దాలో గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. పేలుడులో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అదే సమయంలో పలువురు గాయపడ్డారు.

Bemetara Blast: గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. అంతకంతకు పెరుగుతున్న మృత్యుల సంఖ్య
Gunpowder Factory Blast
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా బెర్లా పిర్దాలో గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. పేలుడులో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అదే సమయంలో పలువురు గాయపడ్డారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించినట్లు తెలిపారు.

శనివారం ఉదయం 7.00 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన తరువాత, అక్కడ శిధిలాలు పేరుకుపోయాయని, ఇందులో చాలా మంది సజీవసమాధి అయ్యి ఉంటారని సమాచారం. జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఫ్యాక్టరీ పరిసరాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా మొత్తం అధికారుల బృందం సంఘటనా స్థలంలో ఉంది. ఇది భారీ పేలుడు, మరిన్ని పేలుళ్లు జరిగే అవకాశం ఉండటంతో సమీప జిల్లాల నుంచి కూడా అగ్నిమాపక దళాలను రప్పించారు. ఇతర సహాయక బృందాలను కూడా సంఘటనా స్థలంలో మోహరించారు.

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి బెమెతర ఘటనపై స్పందించారు. “బెమెతర జిల్లా బోర్సీ గ్రామంలోని గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు విషాద వార్త వచ్చింది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, అవసరమైన సూచనలు అందించాం. ఉన్నతాధికారులు సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని సూచించాం. వీటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సీఎం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. బాధితులను ఆదుకునే పనులు శరవేగంగా ప్రారంభించినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. కాగా, క్షతగాత్రులను సరైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. మొత్తం జిల్లా అధికారయంత్రాంగం రెస్క్యూ కోసం నిమగ్నమై ఉంది. వీలైనంత త్వరగా ప్రజలకు ఉపశమనం కల్పించడమే ప్రాధాన్యతగా తీసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సిఎం అరుణ్ సావో రాయ్‌పూర్‌కు పరామర్శించారు. పేలుడు కారణంగా శిథిలాల కుప్పలు ఉన్నాయి. ఇప్పుడే అధికారికంగా ఏమీ చెప్పడం కష్టం. గాయపడిన వారందరినీ రాయ్‌పూర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, అయితే సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…