ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయం భద్రత లోపం బట్టబయలు అయ్యింది. మద్యం మత్తులో ఓ యువకుడు విమానాశ్రయం గోడ ఎక్కి రన్‌వేపైకి వచ్చాడు. మహాసముంద్ జిల్లాకు చెందిన పర్సమణి ధ్రువ్ మద్యం మత్తులో విమానాశ్రయం గోడ దూకి రన్‌వేలోకి ప్రవేశించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ వైపు పరుగులు తీశాడు. విమానాన్ని దగ్గరగా చూడాలనుకుని ఫ్లైట్ దగ్గరికి చేరుకోవాలనుకున్నాడని అధికారులు తెలిపారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ సంఘటన డిసెంబర్ 13 ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జరిగింది. యువకుడు రన్‌వేపై పరుగెత్తుకుంటూ ఏటీసీ టవర్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. వెంటనే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పరుగులు తీసి అతడిని పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువకుడిపై చోరీ కేసు నమోదు చేశారు. ఈ ఘటన విమానాశ్రయ భద్రతను బట్టబయలు చేసింది. నిందితుడు గోడ ఎక్కి రన్‌వేకి చేరుకున్న తీరు విమానాశ్రయ సరిహద్దు గోడలో భారీ భద్రతా లోపాన్ని చూపిస్తుంది. విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సరిహద్దు గోడను సులభంగా దాటవచ్చు. దీంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ యువకుడు ఏదైనా ఉగ్రవాది లేదా నక్సలైట్ గ్రూపుతో సంబంధం ఉండి ఉంటే, పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉండేవని నిపుణులు అంటున్నారు. రన్‌వేపై టేకాఫ్ అయ్యే సమయంలో, విమానం చాలా వేగంగా ఉంటుంది. విమానాశ్రయం చుట్టూ ఉన్న పక్షులు విమానాన్ని ఎగరకుండా అడ్డుకుంటారు. ఈ సమయంలో, రన్‌వేపైకి వచ్చే ఎవరైనా తీవ్రమైన భద్రతా ముప్పును వాటిల్లే ప్రమాదం ఉంది. తాజాగా మద్యం మత్తులో ఉన్న యువకుడు ఈ తరహా ఘటనకు పాల్పడి ఉండొచ్చు కానీ.. చిన్న పొరపాటు పెను విపత్తుకు దారి తీస్తుంది. విమానాశ్రయ భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..