Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

|

Dec 18, 2023 | 9:53 AM

తమిళనాడు రాష్ట్రాన్ని వానలు వదలడం లేదు. నిన్నమొన్నటి వరకు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం మరోమారు ముంచెత్తుతున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 2, 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. చెన్నై వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. తిరునల్వేలి, రామనంతపురం, పుడుకొట్టై, తూత్తుకుడి, శివగంగా జిల్లాల్లో నేటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని తెల్పింది...

Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
Tamil Nadu Rains
Follow us on

చెన్నై, డిసెంబర్‌ 18: తమిళనాడు రాష్ట్రాన్ని వానలు వదలడం లేదు. నిన్నమొన్నటి వరకు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు ప్రస్తుతం మరోమారు ముంచెత్తుతున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 2, 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. చెన్నై వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. తిరునల్వేలి, రామనంతపురం, పుడుకొట్టై, తూత్తుకుడి, శివగంగా జిల్లాల్లో నేటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని తెల్పింది. ఇక కన్యాకుమారి, తంజావూరు, తిరువరూర్‌, నాగపట్నం, మధురై, మైలాడుతురై, తెన్కాసి, విరుదునగర్ జిల్లాల్లో ఆదివారం వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. రోడ్లపై నీరు నిలిచి రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దక్షిణ తమిళనాడులోని ;ai జిల్లాలతో పాటు దక్షిణ కేరళ, లక్షద్వీప్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం పడింది. పాళయంకోట్టైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరద బాధిత ప్రజలను షెల్టర్ క్యాంపుకు తరలించారు. షెల్టర్ హోమ్‌లోని ప్రజలు రేషన్ కోసం బారులు తీరారు. తూత్కుడి జిల్లా, తాలూకా శ్రీవైకుంటంలో ఆదివారం 525 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

తిరుచెందర్, సాతంకులం, కయతార్, ఒట్టపిడ్రంలలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. భారీ వర్షాల కారణంగా డిసెంబర్ 18వ తేదీన తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎస్డీఆర్‌ఎఫ్‌)కు చెందిన 250 మంది సిబ్బంది సహాయక చర్యల్లోనిమగ్నమైనట్లు తమిళనాడు రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మంత్రి రామచంద్రన్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.