ఎంతకు తెగించావ్‌రా..! ఇంటికెళ్లి చూడు నీకే తెలుస్తుంది.. అక్కకు మెస్సెజ్ పెట్టిన దుర్మార్గుడు.. చివరకు

|

Jun 23, 2024 | 8:53 AM

మంచిగా చదువుకోరా బాగుపడతావ్.. అంటూ ఆమె నిత్యం కొడుకుతో చెప్పేది.. అయినా మాట వినలేదు.. చివరకు డీగ్రీ ఫెయిల్ అయ్యాడు.. ఫెయిల్ అయ్యావేంట్రా.. ఇలా అయితే ఎలా అంటూ ఆ తల్లి బాధతో కొడుకును మందలించింది.. దీంతో కన్నతల్లిపై కక్ష కట్టాడు దుర్మార్గుడు.. ఆ తర్వాత.. అదునుచూసి తల్లిని అతి దారుణంగా చంపాడు.. అనంతరం తమ్ముడు అనాథ అవుతాడని భావించి..

ఎంతకు తెగించావ్‌రా..! ఇంటికెళ్లి చూడు నీకే తెలుస్తుంది.. అక్కకు మెస్సెజ్ పెట్టిన దుర్మార్గుడు.. చివరకు
Crime News
Follow us on

మంచిగా చదువుకోరా బాగుపడతావ్.. అంటూ ఆమె నిత్యం కొడుకుతో చెప్పేది.. అయినా మాట వినలేదు.. చివరకు డీగ్రీ ఫెయిల్ అయ్యాడు.. ఫెయిల్ అయ్యావేంట్రా.. ఇలా అయితే ఎలా అంటూ ఆ తల్లి బాధతో కొడుకును మందలించింది.. దీంతో కన్నతల్లిపై కక్ష కట్టాడు దుర్మార్గుడు.. ఆ తర్వాత.. అదునుచూసి తల్లిని అతి దారుణంగా చంపాడు.. అనంతరం తమ్ముడు అనాథ అవుతాడని భావించి.. అతన్ని కూడా చంపాడు.. ఆ తర్వాత ఫోటో తీసి అక్కకు వాట్సప్ పంపించాడు.. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది..

తమిళనాడులోని తిరువెట్రియూర్‌లో జరిగిన ఈ దారుణమైన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.. ఓ యువకుడు తల్లి, తమ్ముడిని గొంతుకోసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. డిగ్రీ ఫెయిల్ అయ్యాడని కొడుకును తల్లి మందలించడమే దీనికి కారణమని తెలిపారు. కక్ష పెంచుకుని తల్లి, తమ్ముడిని హత్యచేసిన నితీష్‌ అనే యువకుడు.. ఆ తర్వాత మృతదేహాలను కవర్‌లో చుట్టి, ఫొటో తీసి తన పెద్దమ్మ కూతురికి వాట్సాప్‌ చేశాడు.. ఇంటికి వెళ్లి చూడు నీకే తెలుస్తుంది అంటూ మెసేజ్ చేశాడు.. వెంటనే అక్కడకు వెళ్లి చూస్తే ఈ దారుణం బయటపడింది.

ముందుగా తల్లి పద్మను చంపేశాడు సతీష్‌.. తల్లి లేకపోతే 14 ఏళ్ల తమ్ముడు ఒంటరివాడు అవుతాడని సంజయ్‌నూ చంపేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. హత్యల తర్వాత సతీష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చివరికి నిందితుడిని కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నితీష్‌ తల్లి పద్మ అక్యుపంక్చర్‌ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. తండ్రి ఒమన్‌లో డ్రైవర్‌. ఇటీవల డిగ్రీ ఫెయిల్ అవడంతో నితీష్‌ను తల్లి మందలించగా కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొంతకాలం అనంతరం ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తల్లి పరీక్షల ప్రస్తావన తెచ్చి తిట్టిందని కసి పెంచుకొని అమ్మను, తమ్ముడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..