‘కరోనా హెల్మెట్’ తో పోలీసు.. బెంబేలెత్తుతున్న ప్రజలు

| Edited By: Anil kumar poka

Mar 29, 2020 | 12:19 PM

కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చెన్నైలోని ఓ ఆర్టిస్టు విచిత్రమైన హెల్మెట్ నొకదానిని రూపొందించాడు. ఓ సీనియర్ పోలీసు అధికారి సూచనతో ఆయన తయారు చేసిన దీన్ని ‘కరోనా వైరస్ హెల్మెట్’ అని వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు వీధుల్లోకి రాకుండా చూసేందుకు ఈ వెరైటీ హెల్మెట్ ని డిజైన్ చేసినట్టు గౌతమ్ అనే ఆ ఆర్టిస్టు చెబుతున్నాడు. విరిగి..పాడై పోయిన హెల్మెట్ ముక్కలను, కొన్ని కాగితాలను కలిపి తాను దీన్ని తయారు […]

కరోనా హెల్మెట్ తో పోలీసు.. బెంబేలెత్తుతున్న ప్రజలు
Follow us on

కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చెన్నైలోని ఓ ఆర్టిస్టు విచిత్రమైన హెల్మెట్ నొకదానిని రూపొందించాడు. ఓ సీనియర్ పోలీసు అధికారి సూచనతో ఆయన తయారు చేసిన దీన్ని ‘కరోనా వైరస్ హెల్మెట్’ అని వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు వీధుల్లోకి రాకుండా చూసేందుకు ఈ వెరైటీ హెల్మెట్ ని డిజైన్ చేసినట్టు గౌతమ్ అనే ఆ ఆర్టిస్టు చెబుతున్నాడు. విరిగి..పాడై పోయిన హెల్మెట్ ముక్కలను, కొన్ని కాగితాలను కలిపి తాను దీన్ని తయారు చేసినట్టు ఆయన చెప్పాడు. వీధుల్లో 24 గంటలూ సేవలందిస్తున్న పోలీసులు ఈ కొత్తరకం హెల్మెట్ మంచి ఫలితాలను అందిస్తోందని సంబరపడుతున్నారు. తాము ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, వారిని మళ్ళీ వారి వారి ఇళ్లకు పంప లేకపోతున్నామని, కనీసం ఈ హెల్మెట్ ‘అవతారాన్ని’ చూసి అయినా వారు వెనక్కి వెళ్తారని భావిస్తున్నామని ఖాకీలు చెబుతున్నారు. మొత్తానికి ఇది మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. అయితే పౌరుల్లో చాలామంది ఈ ‘భయానక’ హెల్మెట్ చూసి.. బెంబేలెత్తుతున్నారట. కరోనాపై అవగాహనకు పోలీసోళ్లకు ఇంతకన్నా మంచి ఐడియా తట్టలేదా అని గొణుక్కుంటున్నారు.