ఇదెక్కడి దారుణం.. డ్యూటీలో ఉండగా హార్ట్‌ఎటాక్‌తో మరణించిన కార్డియాక్ సర్జన్

వైద్యుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం, ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న పీజీలు, జూనియర్‌ వైద్యుల పరిస్థితి దారుణంగా ఉంటుందని రాశారు. 48గంటలు, 32 గంటల డ్యూటీలతో జూడాలు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారని, సరైన నిద్ర, ఆహారం లేక అనారోగ్యం బారినపడుతున్నారని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూడాల పని గంటలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇదెక్కడి దారుణం.. డ్యూటీలో ఉండగా హార్ట్‌ఎటాక్‌తో మరణించిన కార్డియాక్ సర్జన్
eart surgeon dies of heart attack

Updated on: Aug 31, 2025 | 12:02 PM

ప్రతిరోజూ ఏదో ఒక చోట గుండెపోటు మరణాలకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి, వైద్యులతో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. కానీ, విచిత్రమైన విషయం ఏమిటంటే ఒక హార్ట్‌ సర్జన్ గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో గుండె సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ (39) ఆసుపత్రిలో విధుల్లో ఉండగానే గుండెపోటుతో మరణించారు. ఈ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

గుండెపోటుతో మరణించిన హార్ట్ సర్జన్:

ఇవి కూడా చదవండి

చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో కార్డియాక్ సర్జన్ అయిన డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ ఆసుపత్రిలో విధుల్లో ఉండగానే గుండెపోటుతో మరణించారు. ఆయన సహచరులు ఆయనను బతికించడానికి ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. ఈ షాకింగ్ వార్తను హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ తన X ఖాతాలో షేర్‌ చేశారు.

డాక్టర్ రాయ్ ప్రాణాలను కాపాడటానికి ఆయన సహచరులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. CPR, అత్యవసర యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్, ECMO కూడా ఉపయోగించబడ్డాయి. కానీ వారు ఆయనను కాపాడలేకపోయారు అని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎక్కువగా గుండెపోటుతో బాధపడుతున్నారు. ఇక్కడ షాకింగ్‌ విషయం ఏంటంటే.. ఇతరుల హృదయాలను కాపాడటానికి, రోగుల ప్రాణాలను కాపాడటానికి కష్టపడి పనిచేసే వారు తమ స్వంత హృదయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిద్ర లేకపోవడం, సక్రమంగా పని చేయకపోవడం, సక్రమంగా భోజనం చేయకపోవడం, ఆసుపత్రి క్యాంటీన్ ఆహారం తీసుకోవడం, కెఫిన్ తీసుకోవడం, మానసిక ఒత్తిడి ఇవన్నీ గుండెపోటుకు ప్రధాన కారణాలు. అందువల్ల, ఇతరు ప్రాణాలను కాపాడటానికి కష్టపడి పనిచేసే వైద్యులు తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడానికి, శారీరక శ్రమలో పాల్గొనడానికి, ఒత్తిడిని నిర్వహించడానికి ధ్యానం చేయడానికి, పోషకమైన ఆహారం తినడానికి, విరామం తీసుకోవడానికి, కుటుంబం, స్నేహితులతో సమయం గడపడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సుధీర్ సూచించారు.

ఆగస్టు 28న షేర్ చేయబడిన ఈ పోస్ట్‌కి 85,000 కంటే ఎక్కువ వీక్షణలు, అనేక కామెంట్స్‌ వచ్చాయి. ఒకరు ఈ పోస్ట్‌పై స్పందిస్తూ..ఈ వార్త వినడానికి చాలా బాధగా ఉంది. ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. వైద్యుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం, ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న పీజీలు, జూనియర్‌ వైద్యుల పరిస్థితి దారుణంగా ఉంటుందని రాశారు. 48గంటలు, 32 గంటల డ్యూటీలతో జూడాలు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారని, సరైన నిద్ర, ఆహారం లేక అనారోగ్యం బారినపడుతున్నారని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూడాల పని గంటలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ప్రాణాలను కాపాడే వైద్యుడు గుండెపోటుతో మరణించాడనే వార్త విని చాలా మంది షాక్ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..