Chenab bridge: పూర్తికావొచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన.. ఎక్కడనుకుంటున్నారు..?

|

Feb 26, 2021 | 2:00 PM

Indian Railways: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చీనాబ్ వంతెనకు..

Chenab bridge: పూర్తికావొచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన.. ఎక్కడనుకుంటున్నారు..?
Follow us on

Indian Railways: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చీనాబ్ వంతెనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. జమ్మూకాశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ భారీ ఉక్కు వంతెన నిర్మాణం పూర్తి కావొచ్చినట్లు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ గురువారం వెల్లడించారు. 476 మీటర్ల పొడవులో విల్లు ఆకారంలో నిర్మిస్తున్న.. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన ఫోటోను ఆయన ట్విటర్లో షేర్ చేశారు.

మౌళిక వసతుల కల్పనలో మరో అద్భుతం రూపుదిద్దుకుంటోంది. మరో ఇంజినీరింగ్ మైలురాయి దిశగా భారతీయ రైల్వే పరుగులు పెడుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరుతెచ్చుకోనుంది. అంటూ కేంద్ర మంత్రి గోయల్ ట్వీట్ చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఈ విల్లు వంతెనను నిర్మిస్తున్నారు. 2017 నవంబర్‌లో మెయిన్ ఆర్చ్ పనులు ప్రారంభమయ్యాయి.

476 మీటర్లు విల్లు ఆకారంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 1,315 మీటర్లు. 17 వ్యాసార్థాలల్లో దీనిని నిర్మిస్తున్నారు. కాగా.. దీనికయ్యే అంచనా వ్యయం రూ.1,250 కోట్లు. ఉధంపూర్‌- శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే సెక్షన్‌లో ఈ లైన్‌ను దీనిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి జమ్మూ కశ్మీర్‌లోని బక్కల్‌, కౌరి మధ్య చీనాబ్‌ నదిపై అనుసంధానంగా ఉంటుంది. ఈ వంతెనను జమ్మూ కశ్మీర్‌లోని యుఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్‌ కత్రా-లావోలి విభాగం నిర్మిస్తోంది.

చీనాబ్ వంతెనను నదికి 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది ఈఫిల్ టవర్ (324 మీటర్లు) కంటే 35 మీటర్ల పొడవు ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ చీనాబ్ వంతెన మార్చి నాటికి పూర్తికానుంది. ఈ బ్రిడ్జి పూర్తయితే.. జమ్మూ కాశ్మీర్‌లోని లోయ ప్రాంతాలకు రవాణా మార్గం సులభం అవుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం కూడా అభివృద్ధి జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read:

కేంద్రం, బీసీ కమిషన్‌కు సుప్రీం కోర్టు నోటీసులు.. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణపై విచారణ

ఇది ట్రైలర్ మాత్రమే.. అంబానీ కుటుంబానికి దుండగుడి బెదిరింపు లేఖ.. దర్యాప్తు ముమ్మరం..