చార్‌ధామ్ భక్తులకు అలెర్ట్.. ఇకపై ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం

|

May 17, 2024 | 5:11 PM

ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాల ప్రకారం యాత్రికులు ఇకపై గంగోత్రి , యమునోత్రి , కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలను చిత్రీకరించడం లేదా రీల్స్ తీయడంపై నిషేధం విధించింది. దైవ దర్శనం కోసం చేసే ఈ పవిత్ర తీర్థయాత్రలో ఆధ్యాత్మికత కొరవడుతోందని ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

చార్‌ధామ్ భక్తులకు అలెర్ట్.. ఇకపై ఆలయాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీల్స్‌పై నిషేధం
Char Dham Yatra 2024
Follow us on

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర చార్ ధామ్ యాత్రలో రోజు రోజుకీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. కేధార్ నాథ్, బద్రీనాథ్ ఆలయ తలపులు తెరుచుకున్నాయి. దీంతో భారీగా భక్తులు శివ కేశవులను దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో  భక్తులు రీళ్లు చేసి.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందువల్ల కొంతమంది భక్తులు యాత్ర, ఆలయ చేసే అనుభూతిని మిస్ అవుతున్నారని గుర్తించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాల ప్రకారం యాత్రికులు ఇకపై గంగోత్రి , యమునోత్రి , కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలను చిత్రీకరించడం లేదా రీల్స్ తీయడంపై నిషేధం విధించింది. దైవ దర్శనం కోసం చేసే ఈ పవిత్ర తీర్థయాత్రలో ఆధ్యాత్మికత కొరవడుతోందని ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆధ్యాత్మిక ప్రదేశంలో మనసు ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్తే.. అక్కడ వీడియో షూటింగ్ కోసం భారీ  సంఖ్యలో భక్తులు గుమిగూడడం, బిగ్గరగా సంగీతం ప్లే చేయడం వంటి కార్యకలాపాలతో పుణ్యక్షేత్రాల ప్రశాంతతకు భంగం కలుగుతోందని.. ఇతర భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

చార్ ధామ్ దేవాలయాలలో వీడియోలు, రీల్స్ నిషేధించినట్లు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి, రాధా రాటూరి స్పష్టం చేశారు. దేవాలయాల పవిత్రతను కాపాడటంతో పాటు, యాత్రికులందరికీ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ రోజు డెహ్రాడూన్‌లో ముఖ్యమంత్రి చార్ ధామ్ ఏర్పాట్లపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో ఎవరూ వీడియోలు చిత్రీకరించవద్దని, రీళ్లు చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉండే చర్యలు నిరసించదగ్గవని స్పష్టం చేశారు.

కేదార్‌నాథ్ చేరుకున్న లక్ష మందికి పైగా భక్తులు

మే 31 వరకు వీఐపీ దర్శనంపై నిషేధం పొడిగింపుతో పాటు నిబంధనలలో ఇతర మార్పులు ఉన్నాయి. భక్తులందరూ సులభంగా చార్ ధామ్‌లను సందర్శించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నివేదికల ప్రకారం చార్ ధామ్ యాత్ర కోసం దేశ విదేశాల నుంచి 26 లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. వాస్తవానికి, మే 10న ధామ్ తలుపులు తెరిచినప్పటి నుండి లక్ష మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్ చేరుకున్నారు.

హెలికాప్టర్ సేవలు

హిమాలయాల్లో హిందువుల పుణ్యక్షేత్రమైన చార్‌ధామ్ యాత్ర ఏడాదికి ఒకసారి సాగుతుంది. ఇది ఉత్తరాఖండ్‌లోని నాలుగు పవిత్ర ధామ్‌లైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు లక్షలాది  భక్తులు ఈ యాత్రను చేస్తారు. యమునోత్రి నుంచి ప్రారంభించి గంగోత్రి, కేదార్‌నాథ్, చివరకు బద్రీనాథ్ వరకు సాగే తీర్థయాత్ర సవ్యదిశలో పూర్తవుతుందని నమ్ముతారు. యాత్రికులు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నందున రోడ్డు మార్గం లేదా విమానం ద్వారా ప్రయాణం చేయవచ్చు. మొత్తం నాలుగు ధామ్‌లు చేయలేని కొంతమంది యాత్రికులు బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను మాత్రమే సందర్శించి దో ధామ్ తీర్థయాత్ర కూడా చేయవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..