Chandrayan 3 Success: ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించనున్న ప్రధాని మోదీ.. బెంగళూరులో ఘన స్వాగతం..

| Edited By: Shaik Madar Saheb

Aug 26, 2023 | 6:30 AM

Chandrayan 3: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 ప్రయోగం చందమామపై సూపర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. జాబిల్లిపై మన ప్రగ్యాన్ రోవర్ చక్కర్లు కొడుతోంది. ఇక ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ.. ఈ రోజు విదేశాల నుంచి నేరుగా బెంగళూరు వచ్చి.. సైంటిస్టులను అభినందించనున్నారు. గురువారం గ్రీస్‌ పర్యటనలో అక్కడి భారతీయులతో మాట్లాడిన మోదీ.. చంద్రుని మీద మువ్వన్నెల రెపరెపలతో.. ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో తెలియజేశామన్నారు. భారతదేశంలో..

Chandrayan 3 Success: ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించనున్న ప్రధాని మోదీ.. బెంగళూరులో ఘన స్వాగతం..
PM Modi to congratulate ISRO Team
Follow us on

Chandrayan 3: చందమామపై మన ప్రగ్యాన్ రోవర్ చక్కర్లు కొడుతోంది. చందమామపై హాయిగా విహరిస్తోంది. సెకనుకు మిల్లీ మీటర్‌ చొప్పున బుడిబుడి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది. రెండు రోజుల్లో 8 మీటర్ల మేర కదిలింది ప్రజ్ఞాన్‌ రోవర్‌. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్ కదలికలు ధృవీకరించబడ్డాయని ఇస్రో ప్రకటించింది. రోవర్ దాదాపు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని ట్వీట్ చేసింది. ప్రస్తుతం రోవర్ పేలోడ్‌లు, LIBS, APXS లను ఆన్ చేసినట్లు ఇస్రో తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్ లోని అన్ని పేలోడ్ లు పనిచేస్తున్నాయని వెల్లడించింది.

అంతకు ముందు చంద్రుడిపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 రోవర్ సులభంగా దిగేందుకు ర్యాంప్ సహాయపడిందని ఇస్రో వీడియో రిలీజ్ చేసింది. కేవలం 10 సెకన్లలోపే ర్యాంపు ఓపెన్‌ అవడం.. రోవ్‌ బయటకు రావడం జరిగిందని చెప్పింది. అలాగే సోలార్ ప్యానెల్ రోవర్‌కు శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించిందని వివరించింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చేటప్పుడు ర్యాంప్, సోలార్ ప్యానెల్ ఎలా పనిచేశాయో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రయాన్ 3 మిషన్ లో 26 యంత్రాంగాలను బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో తయారు చేశారని ఇస్రో ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

నడక నేర్చుకుంటున్న రోవర్..

సర్వం సవ్యం.. 


చంద్రయాన్‌ 3 సక్సెస్‌ ప్రపంచ దేశాల ముందు భారత్ సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలకు సాధ్యం కాని రీతిలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 సేఫ్​గా ల్యాండ్ అయింది. దీంతో ఈ విజయం వెనుక ఉన్న ఇస్రో సైంటిస్టులపై ప్రపంచ దేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈ రోజు బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలపనున్నారు. ఇప్పటికే ఇస్రో సైంటిస్టులను కలసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3ని సక్సెస్ చేసిన ఇస్రో సైంటిస్టుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మిషన్​ కోసం కష్టపడిన శాస్త్రవేత్తలకు ఘనంగా సన్మానం చేయాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఏకంగా 500 మంది ఇస్రో సైంటిస్టులను ఘనంగా సన్మానిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

ఇస్రో టీమ్‌ని కలవనున్న మోదీ..


కాగా, గురువారం గ్రీస్‌ పర్యటనలో అక్కడి భారతీయులతో మాట్లాడిన మోదీ.. చంద్రుని మీద మువ్వన్నెల రెపరెపలతో.. ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో తెలియజేశామన్నారు. భారతదేశంలో ఇప్పుడు అభివృద్ధి దూసుకెళ్తోందని.. 9 ఏళ్లలో తమ ప్రభుత్వం వేసిన రోడ్లు.. భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరాన్ని కవర్‌ చేయగలవన్నారు మోదీ. ఇక ఈరోజు ఉదయం బెంగళూరుకు రానున్న ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలను కలసి అభినందనలు తెలపనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..