జూలై 14, 2023న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3ని ప్రయోగించి విజయవంతం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక
భారతదేశం చంద్రయాన్-3 మిషన్ అంతరిక్షంలో నిర్మించిన సినిమాలతో పోలిస్తే తక్కువ బడ్జెట్‌ను కలిగి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభలో తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థపై రాజ్యసభలో ఆమె మాట్లాడారు. చంద్రయాన్-3 ప్రయోగంపై అయిన ఖర్చు కొన్ని సినిమాల కంటే తక్కువ బడ్జెట్‌తోనే ప్రయోగం పూర్తయ్యిందని అన్నారు. చంద్రయాన్ 3 మిషన్ మొత్తం ఖర్చు $75 మిలియన్లు అంటే దాదాపు రూ. 615 కోట్లు అని వెల్లడించారు.
అయితే చంద్రయాన్ 3కి 615 కోట్ల రూపాయలు ఖర్చు అయినా.. ఇవి తుది గణాంకాలు కావని, ఎందుకంటే డిపార్ట్‌మెంట్ చివరకు ప్రతి వ్యయాన్ని లెక్కలు వేసి పూర్తి బడ్జెట్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని అన్నారు. మన చంద్రయాన్-3 మిషన్ కొన్ని సినిమాల కంటే తక్కువ బడ్జెట్‌ను కలిగి ఉందన్నారు. అయితే ఆ సినిమాలకు చంద్రయాన్ -3 వాస్తవ ధర కంటే ఎక్కువ ఖర్చవుతుంది అని నిర్మలాసీతారామన్ అన్నారు. చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్‌ను పోలుస్తూ ఆ సినిమాల పేర్లను కూడా ప్రస్తావించారు మంత్రి. ఇంటర్‌స్టెల్లార్ ఖర్చు $165 మిలియన్లు, ప్యాసింజర్‌ల ఖర్చు $110 మిలియన్లు, ది మార్టిన్ $108 మిలియన్లు, గ్రావిటీ $100 మిలియన్లు అయితే చంద్రయాన్-3 $75 మిలియన్లు అని సీతారామన్ చెప్పారు.
FM Nirmala Sitharaman on ISRO’s technology, Chandrayaan-3 and cost-cutting measures for the mission👇@nsitharaman @isro #Chandrayaan3 @nsitharamanoffc #HAL #BHEL pic.twitter.com/HRHa1q8YKd
— ET NOW (@ETNOWlive) September 20, 2023
ఇన్నోవేట్ ఖర్చు తగ్గించే పద్ధతులు కారణం దీనికి ఎక్కువ రోజుల సమయం పట్టిందని అన్నారు. అయితే గురుత్వాకర్షణ, అయస్కాంత క్షేత్రాలు ఉపగ్రహాన్ని లాగి, ఆపై ఇంధనాన్ని నింపడం, ఇంకొన్ని రోజులు ఎక్కువ సమయం తీసుకున్నా, తక్కువ ఖర్చుతో కూడిన ట్రాక్‌ని వారు ఎంచుకోవడానికి ఇదే కారణం అని మంత్రి చెప్పారు.
చంద్రయాన్-3 విజయం ద్వారా ఇస్రో ఆవిష్కరణలను సాధించిందని, చంద్రయాన్-3 విజయం భారతదేశ పారిశ్రామిక, సాంకేతిక పర్యావరణ వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని ఆమె అన్నారు.
"Budget for movies like Interstellar, Passengers & Gravity are higher than India's Chandrayaan-3," says FM Nirmala Sitharaman@nsitharaman @isro #Chandrayaan3 pic.twitter.com/Csp5xI9ZTN
— ET NOW (@ETNOWlive) September 20, 2023
చంద్రయాన్-3 అనేది చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, రోవింగ్‌లో ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి చంద్రయాన్-2కి ఫాలో-ఆన్ మిషన్. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ (LM), ప్రొపల్షన్ మాడ్యూల్ (PM), ఇంటర్ ప్లానెటరీ మిషన్‌లకు అవసరమైన కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం, అనేక సాంకేతిక ఫీచర్స్ రోవర్‌లో ఉన్నాయన్నారు. ఇస్రో ద్వారా భారత్ ఇప్పటి వరకు 34 దేశాలకుకు చెందిన 431 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.
FM Nirmala Sitharaman on ISRO's technology, Chandrayaan-3 and cost-cutting measures for the mission👇@nsitharaman @isro #Chandrayaan3 @nsitharamanoffc #HAL #BHEL pic.twitter.com/HRHa1q8YKd
— ET NOW (@ETNOWlive) September 20, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి