Chandrayaan 2: భేషుగ్గా ఉన్న విక్రమ్ ల్యాండర్‌.. ఇస్రో స్పష్టం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో పురోగతి లభించింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోగా.. ఈ ప్రయోగం విఫలమైందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రయోగం 5% మాత్రమే విఫలమైందని.. 95శాతం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు ప్రకటించగా.. అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా ఈ ప్రయోగంలో మరో పురోగతి లభించింది. ఆదివారం ల్యాండర్ జాడను కనిపెట్టిన ఇస్రో.. ఇవాళ దాని […]

Chandrayaan 2: భేషుగ్గా ఉన్న విక్రమ్ ల్యాండర్‌.. ఇస్రో స్పష్టం
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 9:36 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో పురోగతి లభించింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోగా.. ఈ ప్రయోగం విఫలమైందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రయోగం 5% మాత్రమే విఫలమైందని.. 95శాతం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు ప్రకటించగా.. అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక తాజాగా ఈ ప్రయోగంలో మరో పురోగతి లభించింది. ఆదివారం ల్యాండర్ జాడను కనిపెట్టిన ఇస్రో.. ఇవాళ దాని పరిస్థితిని గుర్తించింది. హార్డ్ ల్యాండింగ్ కావడంతో ల్యాండర్ విక్రమ్ ముక్కలైపోయి ఉంటుందని చాలా మంది నిపుణులు భావించినా.. విక్రమ్ పరిస్థితి యథాతథంగా ఉందని ఇస్రో అధికారులు సోమవారం ప్రకటించారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్ ల్యాండర్… ముక్కలైపోలేదనీ, అది ఒకే సింగిల్ పీస్‌గా ఉందని ఇస్రో ప్రకటించింది.

నిర్దేశిత లక్ష్యానికి అతి దగ్గరగా ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయ్యింది. ఆర్బిటర్ పంపిన థర్మల్ ఛాయచిత్రాల ద్వారా అది తెలుసుకున్నాం. ల్యాండర్ సింగిల్ పీస్‌గానే ఉంది. ముక్కలు కాలేదు. త్వరలోనే ల్యాండర్‌తో కమ్యునికేషన్‌ను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాం అని అధికారులు తెలిపారు. అయితే చందమామపై ఆకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్లనే అంత ఎత్తు నుంచి పడ్డప్పటికీ ల్యాండర్‌కు ఏమీ కాలేదని తెలుస్తోంది.

కాగా విక్రమ్ ల్యాండర్‌ లోపల ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఉంది. ఒకవేళ ల్యాండర్ ముక్కలై ఉంటే రోవర్ పనిచేసే అవకాశాలు తక్కువగా ఉండేవి. అయితే ఇస్రో చెబుతున్నదాని ప్రకారం ల్యాండర్ సజావుగా ఉంది కాబట్టి.. అతి త్వరలోనే దాని నుంచీ సిగ్నల్స్ అందుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక ఒక్కసారి సిగ్నల్స్ అందితే అందులో నుంచి రోవర్‌ను బయటకు తెప్పించేందుకు కూడా వీలవుతుంది. తద్వారా చంద్రయాన్ 2 విజయం అవుతుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..