Amit Shah – Chandrababu: తెలంగాణ ఎన్నికలే టార్గెట్.. ఆ తర్వాత ఏపీ..! చంద్రబాబు – అమిత్‌షా భేటీ అందుకేనా..?

|

Jun 04, 2023 | 9:30 AM

Chandrababu Naidu meets Amit Shah: బీజేపీ-టీడీపీ మళ్లీ దగ్గరవుతున్నాయా..? తెంగాణ ఎన్నికలతోనే అది మొదలవబోతోందా..? అనేదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌. ఈనేపథ్యంలో బాబు, అమిత్‌షా భేటీ ఆసక్తిని రేపుతోంది.

Amit Shah - Chandrababu: తెలంగాణ ఎన్నికలే టార్గెట్.. ఆ తర్వాత ఏపీ..! చంద్రబాబు - అమిత్‌షా భేటీ అందుకేనా..?
Chandrababu Naidu meets Amit Shah
Follow us on

Chandrababu Naidu meets Amit Shah: బీజేపీ-టీడీపీ మళ్లీ దగ్గరవుతున్నాయా..? తెంగాణ ఎన్నికలతోనే అది మొదలవబోతోందా..? అనేదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌. ఈనేపథ్యంలో బాబు, అమిత్‌షా భేటీ ఆసక్తిని రేపుతోంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి 9 గంటలకు హోంమంత్రి అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు. ముందుగా 8 గంటలకే సమావేశం అనుకున్నప్పటికీ అమిత్‌ షా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో సమావేశం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. తర్వాత కొద్ది సేపటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాలపాటు ఈ భేటీ సాగింది. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు, ఇతరత్రా అంశాలపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. అనంతరం చంద్రబాబు..ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు.

అయితే, దక్షిణ భారతదేశంలో బీజేపీకి అధికారం అందించిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. కాని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఈ ఓటమితో ‘బీజేపీ ముక్త్ దక్షిణ్ భారత్’ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివర్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో గెలుపొందాలంటే ఇప్పుడున్న బలం సరిపోయేలా లేదని అధిష్టానం గ్రహించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉందని తెలుగుదేశం నేతలతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు కూడా చెప్పినట్టు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం మద్ధతుదారులు గెలుపోటములను కూడా నిర్ణయించే స్థాయిలో ఉన్నారని సర్వేల్లో చూపిస్తున్నారు.

అయితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దగ్గరైతే బీజేపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అని మొదట్లో తెలంగాణ బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం కారణంగా సెంటిమెంట్ రివర్స్ అయ్యి ఓటమి పాలైందన్న విశ్లేషణలు తెరపైకి వచ్చాయి.బీజేపీకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన తొలుత వ్యక్తమైంది. అయితే తెలంగాణ సెంటిమెంటుపై ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌ పేరుతో రాజకీయాలు చేసిన కేసీఆర్‌.. తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం, ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇకపై తెలంగాణ సెంటిమెంటుపై ఆ పార్టీ రాజకీయాలు చేయడం సాధ్యం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీడీపీకి దగ్గరైతే అటు ప్రచారం పరంగా.. మైలేజీ రావొచ్చని భావిస్తున్నారు. అయితే తెలంగాణలో పొత్తు ఖరారైనా.. అది బయటినుంచే అందించాలని ఇక్కడి నేతలు కోరుతున్నారు. తెలంగాణలో ట్రయల్స్‌ వేసి.. ఏపీలో బలమైన పొత్తులతో బరిలోకి దిగుదామన్న సంకేతాలు టీడీపీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి బాబు, షా భేటీ తర్వాత రాజకీయాలు ఎలాంటి టర్న్‌తీసుకుంటాయో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..