Railway Bridge: వరదల్లో కొట్టుకుపోయిన 90 ఏళ్లనాటి రైల్వే వంతెన.. నిలిచిన రైలు సర్వీసులు.. ఎక్కడంటే..

|

Aug 20, 2022 | 1:22 PM

నదీగర్భంలో అక్రమ మైనింగ్‌ కారణంగా 90 ఏళ్ల నాటి రైల్వే వంతెన బలహీనపడింది. అక్రమ మైనింగ్ వల్ల వంతెనకు నష్టం వాటిల్లుతుందని రైల్వే అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు కూడా అందాయి.

Railway Bridge: వరదల్లో కొట్టుకుపోయిన 90 ఏళ్లనాటి రైల్వే వంతెన.. నిలిచిన రైలు సర్వీసులు.. ఎక్కడంటే..
Chakki River
Follow us on

Railway Bridge:  దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు పలుచోట్ల విధ్వంసం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. ఈ క్రమంలోనే పంజాబ్‌, హిమాచల్‌ సరిహద్దులోని కాంగ్రా జిల్లాలోని చక్కి నదిపై 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన శనివారం ఉదయం కుప్పకూలింది. చక్కీ నదికి వరద నీటి ప్రవాహం పోటెత్తడంతో బలహీనంగా ఉన్న పిల్లర్‌ కొట్టుకుపోయి ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో వంతెన కొత్త పిల్లర్‌ను నిర్మించేంత వరకు పఠాన్‌కోట్‌, జోగిందర్‌ నగర్‌ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

1928లో బ్రిటీష్‌ వారు నిర్మించి ప్రారంభించిన ఈ మార్గంలో పఠాన్‌ కోట్‌, జోగిందర్‌ నగర్‌ మధ్య ప్రతి రోజు ఏడు రైళ్లు నడిచేవి. పాంగ్‌ డ్యామ్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గం జీవనాధారం. ఇక్కడ రోడ్డు, బస్సు సేవలు లేవు. ఈ గ్రామాల ప్రజలు కాంగ్రా జిల్లా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు రైలు సేవలనే ఉపయోగిస్తుంటారు. నదీ గర్భంలో అక్రమ మైనింగ్‌తో 90 ఏళ్ల నాటి వంతెన బలహీనపడింది.

ఇవి కూడా చదవండి

నదీగర్భంలో అక్రమ మైనింగ్‌ కారణంగా 90 ఏళ్ల నాటి రైల్వే వంతెన బలహీనపడింది. అక్రమ మైనింగ్ వల్ల వంతెనకు నష్టం వాటిల్లుతుందని రైల్వే అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు కూడా అందాయి. గత నెలలో వంతెన పిల్లర్‌లో పగుళ్లు ఏర్పడటంతో రైలు సేవలను నిలిపివేశారు. ఇప్పుడు స్తంభం కొట్టుకుపోయింది. కాంగ్రా జిల్లాలో చాలా నదులు ఉధృతంగా ప్రవహించడంతో అనేక రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది.

స్థానిక వాగులో వరదలు రావడంతో నాగోర్టా బగ్వాన్ ప్రాంతంలోని రాజీవ్ గాంధీ ఇంజినీరింగ్ కళాశాల భవనంలోకి నీరు చేరిందని డిప్యూటీ కమిషనర్ నిపున్ జిందాల్ తెలిపారు. వెంటనే భవనం ఖాళీ చేయించారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి