Omicron Alert: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రాష్ట్రాలకు ICMR కీలక ఆదేశాలు

|

Dec 10, 2021 | 5:10 PM

Omicron Varient: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. ఇవాళ (శుక్రవారం) గుజరాత్‌లో మరో రెండు కేసులు వెలుగుచూడటంతో..

Omicron Alert: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రాష్ట్రాలకు ICMR కీలక ఆదేశాలు
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
Follow us on

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. ఇవాళ (శుక్రవారం) గుజరాత్‌లో మరో రెండు కేసులు వెలుగుచూడటంతో.. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 10 ఒమిక్రాన్ కేసులు, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయ్యాయి. అయితే ఒమిక్రాన్ సోకినవారిలో తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ శుక్రవారం తెలిపారు.

అయితే కరోనా కేసులు పెరుగుతుండటం అధికార యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చీఫ్ బలరాం భార్గవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, దేశంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కోవిడ్ పాజిటివిటీ స్థాయి 5 శాతం కంటే ఎక్కువ అయితే జిల్లా స్థాయిలో ఆంక్షలు విధించాల్సి ఉంటుందని బలరాం భార్గవ్ హెచ్చరించారు. ఆ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలకు అధికారిక సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఒమిక్రాన్, కోవిడ్ విషయంలో భయాందోళనలు వ్యాపించకుండా సాయాన్ని అందిస్తామని చెప్పారు.

Also Read..

Omicron Cases in India: దేశంలో మరోసారి ఒమిక్రాన్ కలకలం.. వెలుగులోకి వచ్చిన మరో రెండు కేసులు

Hyderabad: నిద్రిస్తున్న భార్యను చంపి.. ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త