పశ్చిమబెంగాల్‌ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోం శాఖ నోటీసుల జారీ.. స్పందించకుంటే..

|

Dec 16, 2020 | 12:00 AM

పశ్చిమ‌ బెంగాల్ ప్రభుత్వంపై కేంద్రం కొరడా ఝులిపిస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోల్‌కతాలో

పశ్చిమబెంగాల్‌ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోం శాఖ నోటీసుల జారీ.. స్పందించకుంటే..
Follow us on

పశ్చిమ‌ బెంగాల్ ప్రభుత్వంపై కేంద్రం కొరడా ఝులిపిస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోల్‌కతాలో ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళుతుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి అందరికి తెలిసిందే. అయితే నడ్డాపై దాడి చేసింది తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలే అని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న మోదీ ప్రభుత్వం భద్రతా లోపాల కారణంగా బెంగాల్ అధికారులకు సమన్లు జారీ చేసింది. అయినప్పటికి వారు స్పందించకపోవడంతో తాజగా నోటీసులు జారీ చేసింది.

భద్రత కల్పించడంలో విఫలమైనందుకు బెంగాల్ సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. అలాగే బెంగాల్ క్యాడెర్‌లో విధులు నిర్వహిస్తున్న డైమెండ్ హార్బర్ ఎస్పీ, ప్రెసిడెన్సీ రేంజ్ డీఐజీ, దక్షిణ బెంగాల్ అదనపు డీజీలపై చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు డిప్యూటేషన్‌పై కేంద్రంలో పనిచేయడానికి రావాలని ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా సదరు అధికారులను ఎందుకు పంపిచడం లేదని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇదిలా ఉంటే ఆలిండియా అధికారులను డిప్యూటేషన్‌పై పంపించాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌పై కక్ష కట్టిందని, శాంతి భద్రతల పేరుతో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని చూస్తోందని ఆరోపించింది.