Chhotu LPG: కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా మరిన్ని గ్యాస్ సిలిండర్లు

నగరాల్లో నివసించే వలస కార్మీకులకు కేంద్ర అదిరిపోయే గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ LPG సరఫరాపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో, వలస కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే 5 కిలోల సిలిండర్ల రోజువారీ కోటాను రెట్టింపు చేసింది.

Chhotu LPG: కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా మరిన్ని గ్యాస్ సిలిండర్లు
Chhotu 5kg Lpg

Updated on: Apr 07, 2026 | 12:30 PM

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్‌పీజీ కొరత ఏర్పండి. దీంతో సరఫరాపై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వీటిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నగరాల్లో నివసించే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఛోటు అనే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG సిలిండర్‌ను అందించేందుకు సిద్ధమైంది. సాధారణంగా గ్యాస్ కనెక్షన్ పొందాలంటే అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి ఉంటుంది. దీంతో వలస కార్మికులకు గ్యాస్‌ కొనేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. గ్యాస్ కనెక్షన్ కోసం అడ్రస్ ప్రూఫ్ లేకపోవడంతో వారు బ్లాక్‌లో సిలిండర్ కొనాల్సి పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఛోటు అనే 5 కేజీల సిలిండర్‌ను ప్రారంభించింది. కేవలం ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ID Proof) చూపిస్తే ఈ సిలిండర్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇందులో ‘బైబ్యాక్’ తిరిగి ఇచ్చేసే సౌకర్యం కూడా ఉంది.

కొత్త కేటాయింపులు ఎలా ఉంటాయి?

ఈ ఏడాది మార్చి 2-3 తేదీలలో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల ఆధారంగా ఈ అదనపు కేటాయింపులను లెక్కించనున్నారు. గతంలో మార్చి 21న జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఉన్న 20 శాతం గరిష్ట పరిమితికి ఇది అదనంగా ఉంటుంది. అయితే ఈ అదనపు సిలిండర్లను కేవలం వలస కార్మికులకు సరఫరా చేయడానికి మాత్రమే ఉపయోగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) సహకారంతో ఈ సరఫరా ప్రక్రియ జరుగుతుందని. వలస కార్మికులకు, సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు వంట గ్యాస్ కొరత లేకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us