రైతుల ఆందోళన: రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ప్రయత్నం… తేదీ ప్రకటించాలని అభ్యర్థన…

| Edited By:

Dec 21, 2020 | 11:52 AM

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో అన్నదాతలు చేస్తున్న ఉద్యమం26వ రోజు‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నం చేసింది.

రైతుల ఆందోళన: రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం ప్రయత్నం... తేదీ ప్రకటించాలని అభ్యర్థన...
Follow us on

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో అన్నదాతలు చేస్తున్న ఉద్యమం26వ రోజు‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నం చేసింది. రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఆదివారం లేఖ రాశారు. రైతులు అనుకూలమైన తేదీని నిర్ణయించాలని కోరారు. కేంద్ర ఆహ్వానంపై రైతు సంఘాలు డిసెంబర్ 21న సమావేశమై… కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. కాగా, రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

 

రిలే నిరాహార దీక్షలు…

తమ డిమాండ్ల సాధన కోసం రైతులు రహదారులపై బైఠాయించి, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 21 నాటికి రైతుల ఆందోళనలు 26వ రోజుకు చేరుకోగా… నేటి నుంచి రైతులు 24 గంటల రిలే నిరాహారదీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు. రోజూ 11 మంది రైతులు నిరసన దీక్ష చేపట్టనున్నారు. అంతేకాకుండా డిసెంబర్ 25 నుంచి 27 వరకు హరియాణా జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల వసూలును అడ్డుకోనున్నట్లు రైతు సంఘాలు తెలిపాయి.