ఇస్రో చైర్మన్‌ శివన్‌పై విజిలెన్స్‌ కేసు.. నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడికి జాబ్ ఇచ్చారంటూ ఫిర్యాదు..

Central Vigilance Commission: ఇస్రో చైర్మన్‌ డాక్టర్ కే. శివన్‌‌పై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జనవరి14న కే శివన్‌ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని..

ఇస్రో చైర్మన్‌ శివన్‌పై విజిలెన్స్‌ కేసు.. నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడికి జాబ్ ఇచ్చారంటూ ఫిర్యాదు..

Updated on: Feb 14, 2021 | 4:44 AM

Central Vigilance Commission: ఇస్రో చైర్మన్‌ డాక్టర్ కే. శివన్‌‌పై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జనవరి14న కే శివన్‌ పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కే. శివన్ తన కుమారుడు సిద్ధార్ధ్‌కు నిబంధనలకు విరుద్ధంగా ఇస్రోలో నియమించారన్న ఆరోపణలపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఫిర్యాదు నమోదు చేసింది. అయితే కే శివన్‌ పదవీ విరమణ సమయం జనవరి 14వ తేదీకు కొన్నిరోజుల ముందు సిద్ధార్థన్‌కు తిరువనంతపురంలోని ఇస్రో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్సీ)లో ఉద్యోగం లభించింది. ఈ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని.. దీనిపై విచారణ నిర్వహించాలని విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

నిబంధనల ప్రకారం ఇస్రోలో ఒక ఉద్యోగిని నియమించాలంటే స్క్రీనింగ్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించాలి. కానీ సిద్ధార్థ్ కు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇచ్చారని ఇస్రో ఉద్యోగి నారాయణన్‌ సీవీసీకి ఫిర్యాదు చేయండంతో.. కేసు నమోదు చేశారు. అయితే ఈ పోస్టు నియామకం నిబంధనల ప్రకారమే జరిగిందని కే.శివన్ కార్యాలయం వెల్లడించింది.

 

Also Read:

Arora Akanksha: ఐక్యరాజ్య సమితి చీఫ్ బరిలో భారత సంతతి మహిళ.. ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటున్న మన ‘ఆకాంక్ష’

Bombay High Court: వివాదాస్పద తీర్పులిచ్చిన జస్టిస్ పదోన్నతికి ఎసరు.. పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు..