Kishan Reddy: ప్రధాని మోడీ ప్రథమ స్థానంలో…. ప్రపంచంలోనే ప్రజాదరణ పొందిన నాయకుడన్న కేంద్ర మంత్రి

ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే ప్రజా అమోదం పొందిన నాయకుల్లో ప్రధాని మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy: ప్రధాని మోడీ ప్రథమ స్థానంలో.... ప్రపంచంలోనే ప్రజాదరణ పొందిన నాయకుడన్న కేంద్ర మంత్రి

Edited By:

Updated on: Jan 03, 2021 | 5:47 AM

ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే ప్రజా అమోదం పొందిన నాయకుల్లో ప్రధాని మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 74 శాతం మంది ప్రజలు మోదీకి మద్దతు తెలిపారని.. బ్రెజిల్ అధ్యక్షుడు‌, అమెరికా అధ్యక్షుడు, యూకే ప్రధాని తర్వాతి స్థానాల్లో ఉన్నారన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రధాని సమర్థంగా పనిచేశారని కొనియాడారు. ఈ మేరకు తెలుగు ప్రజల తరఫున ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లోనూ తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలుస్తూ ఆశీర్వదించాలని కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని సమర్థంగా పాలించడమే కాకుండా ప్రపంచ దేశాల ముందు గర్వించే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లడం ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Also Read: ముగ్గురు బీజేపీ నేతలకు రైతుల లీగల్ నోటీసులు, వారిలో రామ్ మాధవ్ కు కూడా , ఆందోళనను కించపరిచారని ఆరోపణ