Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు తీపి కబురు.. సామాన్యులకు భారీ ఊరట..!

|

Jun 01, 2021 | 1:52 PM

Central Government: కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్‌వేవ్‌కరోనా వైరస్‌ నేపథ్యంలో అటు రైతులకు, ఇటు సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. అన్నదాతలకు.

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు తీపి కబురు.. సామాన్యులకు భారీ ఊరట..!
Follow us on

Central Government: కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్‌వేవ్‌కరోనా వైరస్‌ నేపథ్యంలో అటు రైతులకు, ఇటు సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. అన్నదాతలకు ఉచితంగానే ఆయిల్ సీడ్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రెండు ప్రయోజనాలు కలుగనున్నాయి. వీటిని పిండించే రైతులకు లాభం చేకూరుతుండగా, అదే సమయంలో సామాన్యులకు ప్రయోజనం చేకూరనుంది. దీని వల్ల వంట నూనె ధర దిగి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశీయంగా ఉత్పత్తి పెరిగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగా ఆయిల్‌ ధరలు దిగి వచ్చే అవకాశం ఉంటుంది.

దేశ వ్యాప్తంగా ఖరీఫ్‌కు పంటల కోసం ఆయిల్‌ సీడ్స్‌ ఉచితంగా అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. దాదాపు 8 లక్షల మినీ కిట్స్ సోయాబిన్ విత్తనాలు, 74 వేల మినీ కిట్ల వేరుశనగ విత్తనాలను కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించనుందని తెలుస్తోంది.

అయితే ఖరీఫ్‌లో 6.37 లక్షల హెక్టార్లలో ఆయిల్ సీడ్స్ పండించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీని వల్ల 24.3 లక్షల క్వింటాళ్ల నూనె అందుబాటులోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఆయిల్ ధరలు దిగిరావడానికి అవకాశం ఉంటుంది. సోయాబిన్ విత్తనాలను తెలంగాణ సహా మరో పలు రాష్ట్రాల్లో కేంద్రం పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

దీంతో లక్షలకు పైగా హెక్టార్లలో ఆయిల్ సీడ్స్ సాగు చేయనున్నారు. ఇకపోతే వంట నూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు లీటరు నూనె కొనాలంటే రూ.150- రూ.200 వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ఆయిల్‌ ధరలు మండిపోతుండటంతో సామాన్యుడికి భారీగా మారింది. రోజురోజుకు వంట నూనె ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నూనె ధరలపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర సర్కార్‌.. ఈ విధంగా చర్యలు చేపడుతోంది. ఈ చర్యల వల్ల ఆయిల్‌ ధరలు దిగి వస్తే ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగనుంది.

 

ఇవీ కూడా చదవండి:

LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిలిండర్‌ ధర

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం.. మరో బ్యాంకు లైసెన్స్‌ రద్దు.. అయోమయంలో కస్టమర్లు