కరోనా నియంత్రణకు ఐదు సూత్రాలు.. ఆంక్షలు సడలింపుల నేపధ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అదుపులోకి వస్తుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ సడలింపులను ప్రకటించాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి..

కరోనా నియంత్రణకు ఐదు సూత్రాలు.. ఆంక్షలు సడలింపుల నేపధ్యంలో రాష్ట్రాలకు కేంద్రం లేఖ..

Updated on: Jun 19, 2021 | 12:35 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అదుపులోకి వస్తుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ సడలింపులను ప్రకటించాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసి.. లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వాలని కోరారు. ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను( టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా) తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అలాగే కరోనా టెస్టుల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలో పేర్కొన్నారు.

కాగా, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న, పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడం చాలా కీలకమన్న ఆయన.. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని అజయ్ భల్లా సూచించారు. దీని కోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!

Loading...
Unable to load recommendations.
Follow Us