YouTube Channels: మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 35 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

|

Jan 21, 2022 | 8:20 PM

YouTube Channels: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఫేక్‌ న్యూస్‌ను వైరల్‌ చేస్తున్న 35 యూట్యూబ్‌ Youtub)..

YouTube Channels: మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 35 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం
Follow us on

YouTube Channels: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఫేక్‌ న్యూస్‌ను వైరల్‌ చేస్తున్న 35 యూట్యూబ్‌ Youtub)ఛానెళ్లు, 2 ట్విట్టర్ (Twitter) అకౌంట్లు, 2 ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్లు, 2 వెబ్‌సైట్‌ (Website)లను మోడీ ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలతో యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. జనవరి 20వ తేదీన కేంద్ర మంత్రిత్వశాఖకు అందిన ఇంటెలిజెన్స్ ఆధారంగా పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తోన్న ఈ ఛానెళ్ల నుంచి తప్పుడు సమాచారం ప్రసారం అవుతోందని గుర్తించారు.

పాక్‌ కేంద్రంగా ఛానెళ్లు..

పాకిస్తాన్ వేదికగా ఈ ఛానెళ్లు పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఏజెన్సీ సమాచారంతో కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయా ఛానళ్లు, వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఛానెళ్ల ద్వారా భారత వ్యతిరేక వార్తలు ప్రసారం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు జనవరి 19 న సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే కుట్రదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.

అనేక దేశాల్లో ఇలాంటి చర్యలు..

ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలు ఇటువంటి చర్యలను గుర్తిస్తున్నాయని, భారత్ కూడా ఈ విషయంలో ముందు ఉన్నట్లు స్పష్టం చేశారు. యూట్యూబ్ కూడా వారిని బ్లాక్ చేసేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయంతో కూడిన ప్రయత్నంలో, భారతదేశానికి వ్యతిరేకంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన 20 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది.

ఇవి కూడా చదవండి:

Vodafone idea: వొడాఫోన్‌ ఐడియా నుంచి వినియోగదారులు ఎందుకు వెళ్లిపోతున్నారు..? కారణం ఏమిటి..?

Budget 2022: రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పనున్న కేంద్ర సర్కార్‌.. పెరగనున్న పీఎం కిసాన్‌ డబ్బులు..!