దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. ప్రగతి మైదాన్ సొరంగంలో కారు ఆపి, గన్స్ బెదిరించి చోరీకి పాల్పడ్డారు నలుగురు దుండగులు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రగతి మైదాన్ టన్నెల్ నుంచి కారు వస్తుండగా.. రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు అడ్డగించారు. తుపాకీతో కారులోని వారిని బెదిరించి, కారులో ఉన్న రూ. 2 లక్షల క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు దుండగులు. 20 సెకన్ల వ్యవధిలోనే ఈ చోరీ జరిగింది.
అయితే, ఈ చోరీ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది. వీడియోను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించే సామర్థ్యం గల మరొకరిని ఎల్జీగా నియమించాలన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం కేంద్రానికి చేతకాకపోతే ఆ బాధ్యతను ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
People are not safe in capital of India !#DelhiPolice under @AmitShah is incapable of protecting Delhi & law and order
Daylight Robbery in #Delhi‘s #PragatiMaidan
Video of Rs 2 lakh loot#CCTV #ViralVideo#DelhiCrime #WrestlersProtest#NirmalaSitharaman pic.twitter.com/TebVEx7gmU— SaifuddinTMYC (@SR_Tmc007) June 26, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..