CBSE Class 10 Result: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను జూలై 20న బోర్డు వెల్లడించనుంది. ఎప్పటిలాగే ఇంటర్నల్‌కు 20 మార్కులు కేటాయించగా, మిగతా 80 శాతం మార్కులను యూనిట్ టెస్టులకు 10, అర్ధ సంవత్సరం పరీక్షలకు30, ప్రీ బోర్డు పరీక్షలకు 40 చొప్పున కేటాయించి దానికి అనుగుణంగా ఫలితాలు ప్రకటించనుంది. విద్యార్థులకు పాస్ మార్కులు రాకపోతే గ్రేస్ మార్కులు ఇవ్వనుండగా, అప్పటికే ఫెయిల్ అయితే ఎపెన్షియల్ రిపీట్ కంపార్ట్‌మెంట్ కేటగిరిలో ఉంచుతారు.
కాగా, ఈ సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల మార్కులను బోర్డుకు సమర్పించే గడువును సీబీఎస్‌ఈ పొడిగించిన నేపథ్యంలో ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. అయితే విద్యార్థుల మార్కుల జాబితా పూర్తయిందని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. మార్కుల ప్రక్రియ పూర్తయినందున జూలై 20న ఫలితాలు విడుదల కానున్నాయి. ముందుగా జూన్‌లో ఫలితాలు విడుదల అవుతాయనుకున్నా.. విడుదల కాలేదు. కరోనా కారణంగా కూడా ఫలితాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.