CBSE Board Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల కోసం 10, 12వ తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోని పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందోనంటూ దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ రోజు సీబీఎస్ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను ఈ రోజు విడుదల చేయనుంది. అయితే ఈ ఏడాది మే 4 నుంచి జూన్ 10వ తేదీన మధ్యన సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన మాదిరిగానే రాతపూర్వకంగానే పరీక్షలు ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించింది. సాధారణంగా 50రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఉంటుంది. కానీ ఈ సారి 35రోజుల్లోనే పరీక్షలను పూర్తిచేయనున్నారు.
అధికారిక వెబ్‌సైట్- cbse.nic.in లో లాగిన్ అవ్వండి..
దానిలో క్లాస్ 10, 12 ఎక్సామ్స్ డేడ్స్ లింక్ కనిపిస్తుంది. లేకపోతే హోం పేజీలో ‘recent announcements’ మీద క్లిక్ చేయాలి..
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ కనిపిస్తుంది. వాటి మీద క్లిక్ చేసి బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: