సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈరోజు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్న బోర్డు..

|

Feb 02, 2021 | 11:26 AM

సీబీఎస్ఈ ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. పది, 12వ తరగతుల విద్యార్థులు గత కొంతకాలంగా పరీక్షల షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పరీక్షల...

సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈరోజు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్న బోర్డు..
Follow us on

CBSE Board Exam 2021: సీబీఎస్ఈ ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. పది, 12వ తరగతుల విద్యార్థులు గత కొంతకాలంగా పరీక్షల షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పరీక్షల షెడ్యూల్‌ను ఈ రోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ విడుదల చేయనుంది. ఈ ఏడాది మే 4 నుంచి జూన్ 10వ తేదీన మధ్యన సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన మాదిరిగానే పరీక్షలు ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించింది. సాధారణంగా 50రోజుల పాటు పరీక్షల షెడ్యూల్ ఉంటుంది. కానీ ఈ సారి కోవిడ్ మహమ్మారి కారణంగా 35రోజుల్లో పరీక్షలను పూర్తిచేయనున్నారు.

పన్నెండో తరగతి విద్యార్థులకు ఆ పేపర్లు ముందుగానే..
పన్నెండో తరగతి విద్యార్థులకు తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించే అవకాశముంది. జేఈఈ మెయిన్ 2021 పరీక్ష కారణంగా.. పరీక్షలు ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ పేపర్లను ముగించే అవకాశముంది.

షెడ్యూల్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్- cbse.nic.in లో లాగిన్ అవ్వండి..
దానిలో క్లాస్ 10, 12 ఎక్సామ్స్ డేడ్స్ లింక్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
అయితే అడ్మిట్ కార్డులు మాత్రం మార్చి చివరన విడుదలయ్యే అవకాశం ఉంది.. జూలై 15 లోగా ఫలితాలు ప్రకటించే అవకాశముంది.

 

Also Read: