Akhada Death Mystery: ప్రయాగరాజ్ మఠంలో నరేంద్రగిరి అఖాడా డెత్ మిస్టరీపై దర్యాప్తులోకి సీబీఐ ఎంట్రీ

|

Sep 24, 2021 | 12:35 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరేంద్రగిరి అఖాడా కేసు దర్యాప్తుకు రంగంలోకి దిగింది సీబీఐ. మహంత్‌ నరేంద్రగిరిది హత్య, ఆత్మహత్య

Akhada Death Mystery: ప్రయాగరాజ్ మఠంలో నరేంద్రగిరి అఖాడా డెత్ మిస్టరీపై దర్యాప్తులోకి సీబీఐ ఎంట్రీ
Akhada Death Mistery
Follow us on

Mahant Narendra Giri’s death: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నరేంద్రగిరి అఖాడా కేసు దర్యాప్తుకు రంగంలోకి దిగింది సీబీఐ. మహంత్‌ నరేంద్రగిరిది హత్య, ఆత్మహత్య అన్న అంశంపై నిజాలు నిగ్గు తేల్చనుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన నరేంద్రగిరి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తుకు సిఫార్స్‌ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌. దీంతో దర్యాప్తుకు అంగీకరించిన సీబీఐ..ఈ కేసు విచారణకు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనుంది ఆరుగురు సభ్యుల బృందం.

ఇక ఇప్పటికే నరేంద్రగిరి అఖాడా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తోంది సిట్‌. ఆత్మహత్య, హత్య అన్న కోణంలో విచారిస్తోంది. ఐతే సూసైడ్‌ అయితే నరేంద్రగిరికి ఆ అవసరం ఎందుకొచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం నరేంద్రగిరిది ఆత్మహత్యగా చెబుతున్నారు..కానీ అతని శిష్యులు మాత్రం ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర గిరి మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ తర్వాతే క్లారిటీ వస్తుందని అంటున్నారు.

మహంత్ నరేంద్ర గిరి ఈ నెల 20న ప్రయాగరాజ్ బాఘంబరి గడ్డి మఠంలోని తన గదిలో శవమై కనిపించారు. ఉరి కారణంగా ఆయన ఊపిరాడక మరణించినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. ఐతే నరేంద్రగిరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ముగ్గురిని అరెస్ట్‌ చేశారు యూపీ పోలీసులు.

Read also: Modi US Visit: పీఎం నరేంద్ర మోదీ – జపాన్ ప్రధాని యోషిహిదే సుగాల మధ్య ఆసక్తికర చర్చలు